TDP vs YCP: నందమూరి బాలకృష్ణపై సెన్షేనల్ కామెంట్స్ చేసిన మంత్రి.. అలాంటి వ్యక్తి వెంట ఉన్నారంటూ..

|

May 31, 2022 | 10:02 AM

TDP vs YCP: టీడీపీ వర్సెస్‌ వైసీపీ డైలాగ్‌ వార్ పీక్స్‌కు చేరింది. డైలాగ్‌లకు మరింత పెట్టారు వైసీపీ నేతలు. తాజాగా, ఎమ్మెల్యే బాలకృష్ణపై సీరియస్‌ కామెంట్స్ చేశారు మంత్రి జయరాం.

TDP vs YCP: నందమూరి బాలకృష్ణపై సెన్షేనల్ కామెంట్స్ చేసిన మంత్రి.. అలాంటి వ్యక్తి వెంట ఉన్నారంటూ..
Minister Jayaram
Follow us on

TDP vs YCP: టీడీపీ వర్సెస్‌ వైసీపీ డైలాగ్‌ వార్ పీక్స్‌కు చేరింది. డైలాగ్‌లకు మరింత పెట్టారు వైసీపీ నేతలు. తాజాగా, ఎమ్మెల్యే బాలకృష్ణపై సీరియస్‌ కామెంట్స్ చేశారు మంత్రి జయరాం. ఏపీలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్న మంత్రి రోజా వర్సెస్, ఎమ్మెల్యే బాలయ్య మధ్య డైలాగ్‌ వార్‌ జరగ్గా, తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాం బాలకృష్ణపై ఫైర్‌ అయ్యారు. 8 ఏళ్లలో 8 నిమిషాలు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదని సెటైర్లు వేశారు.

అక్కడితో ఆగకుండా, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వెంట బాలకృష్ణ వెళ్లడం సిగ్గుచేటన్నారు మంత్రి జయరాం. వంశాన్ని నాశనం చేసిన చంద్రబాబు వెంట ఉన్నందుకే, కొందరు నేతలు బాలకృష్ణను దూరం పెట్టారని కామెంట్ చేశారు మంత్రి జయరాం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సింగిల్‌గానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు మంత్రి జయరాం. నిజంగా వారిపై వారికి నమ్మకం ఉంటే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒంటరిగా పోటీచేయాలని సవాల్‌ విసిరారు. మరో 30 ఏళ్లు జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు మంత్రి జయరాం.