Andhra Pradesh: పద్ధతి మార్చుకుంటేనే భవిష్యత్.. నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు చంద్రబాబు దిశానిర్దేశం.. 

|

Sep 17, 2022 | 7:32 AM

ఆంధ్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో కీలక ప్రకటన చేశారు. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామన్న చంద్రబాబు మరోసారి నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీ నియోజకవర్గ..

Andhra Pradesh: పద్ధతి మార్చుకుంటేనే భవిష్యత్.. నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు చంద్రబాబు దిశానిర్దేశం.. 
Chandrababu
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో కీలక ప్రకటన చేశారు. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామన్న చంద్రబాబు మరోసారి నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల పనితీరు ఆధారంగానే భవిష్యత్తులో పార్టీ టిక్కెట్లు కేటాయింపు ఉంటుందని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. పాణ్యం, బనగానపల్లి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో ప్రధానంగా చర్చ జరిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 46 మంది నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. కాగా.. పార్టీ కోసం ఎమ్మెల్యేలందరూ బాగా కష్టపడుతున్నారని, వచ్చే ఎన్నికల కోసం పనిచేసుకోవాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ మాదిరిగా వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలకు టికెట్లు ఇచ్చే ధైర్యం ముఖ్యమంత్రి జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి (Amaravati) పై మాట తప్పారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలకు సంపద సృష్టి కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటే లక్ష్యంగా అధికారపక్షం ముందుకు వెళ్తోంది. ఈ పరిస్థితుల్లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచే పాలన ఉండనుందని తేల్చి చెప్పారు. ఇందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెట్టి తీరతామని స్పష్టం చేశారు.

కాగా.. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణం చేసే కోసం రూ. లక్షల కోట్ల రూపాయల్లో 10 శాతం విశాఖపట్నంలో చేస్తే అది మరింత పెద్ద నగరంగా మారుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నమే పెద్ద నగరమని జగన్‌ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..