Andhra Pradesh: చంద్రబాబు నిర్ణయాలపై సిట్‌.. సుప్రీంలో ముగిసిన వాదనలు.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

అమరావతి భూములు, ఫైబర్‌నెట్‌ కుంభకోణాలకు సంబంధించిన సిట్‌ విచారణకు సంబంధించిన బంతి ఇప్పుడు సుప్రీం చేతికి చేరింది. రెండు మూడు రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు సంచలనంగా మారనుంది.

Andhra Pradesh: చంద్రబాబు నిర్ణయాలపై సిట్‌.. సుప్రీంలో ముగిసిన వాదనలు.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
Supreme Court
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 18, 2022 | 7:00 AM

ఏపీ ప్రభుత్వం సిట్​ఏర్పాటుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. టీడీపీ హాయంలో కుంభకోణాలు జరిగాయాంటూ సిట్‌ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. సిట్ ఏర్పాటుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. స్టేను ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు స్టేపై పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. ఇరు వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్‌ చేసింది. అమరావతి భూములు, ఫైబర్‌నెట్‌ కుంభకోణాలకు సంబంధించిన సిట్‌ విచారణకు సంబంధించిన బంతి ఇప్పుడు సుప్రీం చేతికి చేరింది. రెండు మూడు రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు సంచలనంగా మారనుంది. సుప్రీం కీలక తీర్పుపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి ఇరుపక్షాలు. ఎవరికి అనుకూలంగా.. ఎవరికి వ్యతిరేకంగా వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. విచారణ సమయంలో జస్టిస్‌ ఎం.ఆర్‌. షా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదిపై సీరియస్ అయింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారం లేదంటే ఎలా అని ప్రశ్నించింది. రాజకీయ వైరం వల్ల ఎంక్వేరీ చేయోద్దు అంటే ఎలా? క్లీన్ గా ఉంటే ఎందుకు భయపడుతున్నారు? సిట్​లో అంతా పోలీస్​ఉన్నతాధికారులే ఉన్నారు కదా? అంటూ ప్రశ్నించింది.

కాగా కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సుల మేరకే ఓ పోలీసు స్టేషన్‌లో సిట్‌ను ఏర్పాటు చేసినట్లు సుప్రీంకు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్ అభిషేక్‌ మనుసింఘ్వి. గత ప్రభుత్వంపై పక్షపాతంతోనే ఆ అంశాలపై జివో ఇచ్చారంటూ వాదనలు వినిపించారు వర్లరామయ్య తరపు లాయర్ దవే. అధికార పార్టీతో నిజనిర్దారణ ఏర్పాటు చేయడంతోనే హైకోర్టు కలుగజేసుకుందని చెప్పారు. ఇరు వాదనలు విన్న సుప్రీం.. తీర్పు రిజర్వ్ చేసింది. ఏలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ ఇరు పక్షాల్లో నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..