ముందుంది మరీంత మండేకాలం..

రానున్నది మండేకాలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నుంచే బీ అలర్ట్‌ అంటూ సూచిస్తున్నారు. శివరాత్రి తర్వాత శివశివ అంటూ చలి వెళ్లిపోగా.. సూర్యుడికి భూ దక్షిణార్ధగోళం దగ్గరవుతోంది.

ముందుంది మరీంత మండేకాలం..
Follow us

|

Updated on: Feb 28, 2020 | 5:59 PM

రానున్నది మండేకాలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నుంచే బీ అలర్ట్‌ అంటూ సూచిస్తున్నారు. శివరాత్రి తర్వాత శివశివ అంటూ చలి వెళ్లిపోగా.. సూర్యుడికి భూ దక్షిణార్ధగోళం దగ్గరవుతోంది. అందుకే ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ వేసవిలో నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపించనున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు.. 45 డిగ్రీలకు తాకుతాయని అంచనా వేసిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సారి సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 1 డిగ్రీ సెల్సియస్‌ వరకు అదనంగా నమోదుకానున్నాయని చెప్పారు. భూతాపంతో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులే దీనికి కారణమని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మార్చి రెండోవారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు.. మే నెలలో వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వేసవి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు కోస్తాంధ్ర జిల్లాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో గరిష్ఠంగా 45 డిగ్రీలు, రాయలసీమ జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ను దాటొచ్చని అంటున్నారు. కాలుష్యం, అడవుల నరికివేత, జలవనరులు కుదించుకుపోవడం లాంటివి మార్పులకు కారణాలుగా చెబుతున్నారు.

మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తీవ్రమైన వేసవితాపం, ఉక్కపోతలు తప్పవు. కాబట్టి… అందుకు తగ్గట్టు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలని సూచించారు. గాలి బాగా తగిలేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే… చిన్న పిల్లలు, వృద్ధులకు ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తవహించాలని చెబుతున్నారు. పండ్ల రసాలు, పౌష్టికాహారం తీసుకుంటూ… ఎక్కువగా నీరు తాగుతూ, ముఖాలకు స్కార్ఫులూ ధరించాలని నిపుణులు సూచించారు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు