వీడు మామూలోడు కాదు.. కత్తితో అత్తారింటికి వచ్చిన అల్లుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

|

Jul 31, 2024 | 12:37 PM

ప్రేమ పెళ్లి.. ఆ తర్వాత కలహాల కాపురం.. భార్య భర్త మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి.. దీంతో భార్య పుట్టింటికి వచ్చి ఉంటోంది.. అయితే.. తన భార్యను కాపురానికి పంపకుండా అత్త అడ్డుపడుతోందన్న అక్కసుతో అల్లుడు దారుణానికి పాల్పడ్డాడు.. కత్తితో అత్తపై విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను హతమార్చాడు. మామ వచ్చే వరకు అక్కడే ఉన్న అతను.. ఆయనపైనా దాడి చేశాడు..

వీడు మామూలోడు కాదు.. కత్తితో అత్తారింటికి వచ్చిన అల్లుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Crime
Follow us on

ప్రేమ పెళ్లి.. ఆ తర్వాత కలహాల కాపురం.. భార్య భర్త మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి.. దీంతో భార్య పుట్టింటికి వచ్చి ఉంటోంది.. అయితే.. తన భార్యను కాపురానికి పంపకుండా అత్త అడ్డుపడుతోందన్న అక్కసుతో అల్లుడు దారుణానికి పాల్పడ్డాడు.. కత్తితో అత్తపై విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను హతమార్చాడు. మామ వచ్చే వరకు అక్కడే ఉన్న అతను.. ఆయనపైనా దాడి చేశాడు.. కత్తితో పొట్టలో పొడిచాడు. ఆ వెంటనే అంబులెన్సుకు సమాచారం ఇచ్చాడు.. ఆ తర్వాత మామను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు.. ఈ షాకింగ్ ఘటన అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరులో చోటుచేసుకుంది. చోడవరం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డూరుకు చెందిన సానబోయిన పైడిరాజు, లక్ష్మి (53) దంపతులు… వీరికి పూర్ణ సంధ్య అనే కుమార్తె ఉంది.. అయితే.. ఇదే గ్రామానికి చెందిన మామిడి వెంకట పైడితల్లినాయుడితో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. మొదట  ఒప్పుకోని పెద్దలు.. ఆ తర్వాత నాలుగేళ్ల కిందట వివాహం చేశారు. పైడితల్లినాయుడు, సంధ్యకు మూడేళ్ల వయసున్న లాస్య, పది నెలల పాప ఉన్నారు. ఈ క్రమంలో.. కలహాలు మొదలయ్యాయి.. భర్తతో గొడవపడిన సంధ్య కొన్నాళ్ల కిందట పుట్టింటికి వచ్చి ఉంటోంది.. చిన్న కుమార్తెతో కలిసి విశాఖపట్నంలో ఉంటూ చెప్పుల దుకాణంలో పనిచేస్తోంది.

అయితే.. సంధ్యను తల్లిదండ్రులు లక్ష్మి, పైడిరాజు కాపురానికి పంపడం లేదని అల్లుడు నాయుడు వారిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే.. ఆవేశంతో సోమవారం సాయంత్రం అత్తారింటికి వచ్చాడు. ఆ సమయంలో అత్త లక్ష్మి, మనుమరాలు ఇంట్లోనే ఉన్నారు. రావడం రావడంతోనే.. కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు.. దీంతో లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం బంధువులను పిలిచి కుమార్తె లాస్యను వారికి అప్పగించాడు. మామ పైడిరాజు కోసం ఇంట్లోనే మాటు వేసిన నాయుడు.. సాయంత్రం ఇంటికి రాగానే పైడిరాజుపైనా కత్తితో దాడి చేశాడు.

అనంతరం తీవ్ర గాయాలైన మామను ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చాడు.. స్థానికులు ఏమైందని ప్రశ్నించగా.. కత్తిపీటపై పడ్డాడని చెప్పి అంబులెన్సులో విశాఖపట్నం తీసుకువెళ్లాడు. అయితే.. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారంతో మంగళవారం అడ్డూరులోని లక్ష్మి ఇంటికి ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లారు. తాళం వేసి ఉండటం, అనుమానం రావడంతో ఈ విషయాన్ని సీఐ శ్రీనివాసరావుకు తెలియజేశారు. గ్రామ పెద్దలకు చెప్పగా అనుమానం వచ్చి వారు తలుపులు తెరిచి పరిశీలించారు. ఈ క్రమంలో లక్ష్మి రక్తంమడుగులో పడి ఉంది..

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..