Chicken Prices: శ్రావణ మాసం ఎఫెక్ట్.. చికెన్, కోడి గుడ్ల ధరలు ఢమాల్.. ఇప్పుడు కిలో ఎంతంటే..?

చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి. అలాగే కోడి గ్రుడ్ల ధరలు కూడా ఆమాంతం తగ్గిపోతున్నాయి. ఇటీవల కిలో చికెన్ ఏకంగా రూ.340కి చేరుకుని షాక్‌కు గురి చేసింది. అయితే ఇప్పుడు రెండు వారాల్లోనే భారీగా పడిపోయింది. ఇక కోడి గుడ్ల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

Chicken Prices: శ్రావణ మాసం ఎఫెక్ట్.. చికెన్, కోడి గుడ్ల ధరలు ఢమాల్.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
Chicken Prices

Updated on: Aug 16, 2026 | 8:10 AM

శ్రావణ మాసం రాకతో చాలామంది నాన్ వెజ్ వంటకాలకు దూరంగా ఉంటున్నారు. శ్రావణ మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు. మళ్లీ శ్రావణ మాసం పూర్తయిన తర్వాత తినడం మొదలుపెడతారు. దీని ప్రభావంతో ఈ మాసం వచ్చిందంటేనే.. చికెన్, కోడి గుడ్లకు డిమాండ్ భారీగా తగ్గిపోతూ ఉంటుంది. దీని వల్ల వీటి ధరలు పడిపోతూ ఉంటాయి. ఈ సారి కూడా అదే జరిగింది. శ్రావణ మాసం రాకతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పడిపోయాయి. గత నెలలో కిలో చికెన్ రూ.350 వరకు చేరుకోగా.. ఒక్కో గుడ్డు ధర రూ.8 వరకు చేరుకుంది. కానీ ఇప్పుడు చికెన్‌తో పాటు గుడ్ల ధరలు కూడా పడిపోయాయి. గత కొద్ది రోజులలో ఈ రెండింటి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆదివారం చికెన్, కోడి గుడ్ల ధరలు ఎలా ఉన్నాయంటే..

చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే

-ఆగస్ట్ 16న హైదరాబాద్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.222 పలుకుతుండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.197కి చేరుకుంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ రూ.127గా ఉండగా.. ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.100 వద్ద కొనసాగుతోంది. ఇక వరంగల్ డివిజన్‌లో్ కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు విజయవాడ జోన్ పరిధిలో కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.240 వద్ద పలుకుతుండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.212, రిటైల్ లైవ్ బర్డ్ రూ.137, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.110గా ఉంది. ప్రాంతాలను బట్టి చికెన్ ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. స్థానిక ఫామ్స్, రవాణా ఖర్చుల ఆధారంగా ధరల్లో మార్పులు ఉంటాయి.

కోడి గుడ్ల ధరలు ఎలా ఉన్నాయంటే..

విజయవాడ జోన్ పరిధిలో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.75గా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, కరీంనగర్ జోన్ పరిధిలో రూ.74గా ఉంది. శ్రావణ మాసం రాకతోనే ధరలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మాసం పూర్తయ్యేవరకు ధరలు ఇలాగే కొనసాగుతాయని, మరింత తగ్గే అవకాశముందని షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. కోళ్లకు డిమాండ్ తగ్గడంతో ధరలు కూడా తగ్గుముఖం పట్టినట్లు చెబుతున్నారు.  దీంతో తమకు ఆదాయం కూడా తగ్గిపోతుందని ఆవేదన చెందుతున్నారు. అయితే గత నెలలో చికెన్ ధర రూ.340కి చేరుకోగా.. ఇప్పుడు రూ.240 పలుకుతుంది. కొద్ది రోజుల్లోనే రూ.100 మేర పడిపోయింది. రానున్న రోజుల్లో మరికొంత తగ్గే అవకాశాలున్నట్లు ఫామ్స్ నిర్వహకులు చెబుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us