Watch: వరలక్ష్మి వ్రతం వేళ విరబూసిన బ్రహ్మ కమలాలు.. కాకినాడ జిల్లాలో అరుదైన దృశ్యం!

సాధారణంగా బ్రహ్మ కమలాలు హిమాలయాల్లో పూస్తాయి. జనాలు వీటిని ఎక్కవగా సినిమాల్లోనే చూసి ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పవిత్రమైన అరుదైన పుష్పాలు కాకినాడ జిల్లాలో కనువిందు చేస్తున్నాయి. శంఖవరానికి చెందిన ఓ ఫ్యామిలీ నాటిని మొక్కకు సరిగ్గా శ్రావణ మాసంలోనే పూలు వికసించడంతో ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.

Watch: వరలక్ష్మి వ్రతం వేళ విరబూసిన బ్రహ్మ కమలాలు.. కాకినాడ జిల్లాలో అరుదైన దృశ్యం!
Brahma Kamalam Kakinada

Updated on: Aug 22, 2026 | 11:06 AM

సాదారణంగా బ్రహ్మ కమలాలు హిమాయ ప్రాంతాలు, మంచుకొండల్లోనే పూస్తాయని చాలా మంది అనుకుంటారు. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా అలానే చూపించారు. కానీ ఇప్పుడే బ్రహ్మ కమలాలు మన ఆంధ్రప్రదేశ్‌లోనూ కనువిందు చేస్తున్నాయి. అవును కాకినాడ జిల్లా శంఖవరం మండల కేంద్రంలో అరుదైన బ్రహ్మ కమలాలు విరబూశాయి. శంఖవరానికి చెందిన కంద సుబ్బారావు, సత్యవతి దంపతుల ఇంటి వద్ద పెంచుతున్న బ్రహ్మ కమలం మొక్కకు ఒకేసారి ఏకంగా ఏడు మొగ్గలు వచ్చాయి. అందులో రెండు పువ్వులు పూర్తిగా వికసించాయి.

సాధారణంగా బ్రహ్మ కమలం మొక్కకు ఒకటి లేదా రెండు పువ్వులు మాత్రమే పూస్తాయని, కానీ ఈసారి ఒకేసారి ఏడు మొగ్గలు రావడం ఎంతో అరుదని సుబ్బారావు దంపతులు తెలిపారు. పవిత్రమైన శ్రావణమాసంలో, వరలక్ష్మి వ్రతం సమయంలో ఈ పుష్పాలు వికసించడాన్ని తమ కుటుంబానికి దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ బ్రహ్మ కమలం మొక్కకు కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us