రాయలసీమకు మహర్దశ.. రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి!

Rayalaseema Horticulture: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయనుంది. 'రాయలసీమ రైజింగ్' కార్యక్రమం కింద మూడేళ్లలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, ఈ ప్రాంతాన్ని ఉద్యానవన పంటల ఫ్రూట్ బౌల్‌గా మార్చడమే లక్ష్యం. తిరుపతిలో ప్రత్యేక ప్రాధాన్యత, రిలయన్స్‌తో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు కీలక అంశాలు.

రాయలసీమకు మహర్దశ.. రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి!
Rayalaseema Horticulture

Edited By:

Updated on: Oct 01, 2026 | 9:14 PM

Rayalaseema Horticulture: రాయలసీమ అభివృద్ధికి ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమను అభివృద్ధి చేయనుంది. మూడేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులను పెట్టబోతోంది. ప్రభుత్వం నుంచి రూ.40 వేల కోట్లు, ప్రైవేట్ రంగం ద్వారా రూ.60 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించనుంది. రాయలసీమ దశా దిశా మార్చే ప్రయత్నం చేస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చేత ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయనుంది. ఉద్యాన విప్లవం తీసుకొని రానుంది.

మూడేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు

రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే ప్రముఖ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైజింగ్’ కార్యక్రమం ద్వారా రానున్న మూడేళ్లలో సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయబోతోంది. రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు సమగ్ర మార్గదర్శకాలు, కార్యాచరణ ప్రణాళికను రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం అక్టోబర్ 2న మదనపల్లి వేదికగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది.

సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాయలసీమలోని 8 జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలతో కలిసి 10 జిల్లాల్లో వచ్చే 3 ఏళ్లలో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. రూ.40 వేల కోట్లు ప్రభుత్వ పెట్టుబడులుగా, రూ.60 వేల కోట్లను ప్రైవేట్ పెట్టుబడులుగా సమీకరించనున్న ప్రభుత్వం.. ఉద్యానశాఖ ద్వారా రూ.14,906 కోట్లు, నీటిపారుదల శాఖ ద్వారా రూ.20,884 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.4,562 కోట్లకు పైగా కేటాయింపులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనుంది.

తిరుపతి జిల్లాలో రూ. 1100 కోట్లతో

రాయలసీమలోని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, ప్రాంతాలు, భూమి స్వభావం, మార్కెట్ అవకాశాలను పరిగణనలోకి తీసుకొని హార్టికల్చర్ హబ్ గా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేయబోతోంది. ఆయా ప్రాంతాల్లో పండే పండ్లు, కూరగాయలు, పూలు తదితర ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించనుంది. రాయలసీమలో విభిన్న రకాల ఉద్యాన పంటలకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలోని ప్రధాన పండ్ల ఉత్పత్తి ప్రాంతాల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతోందని రాయలసీమలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మైక్రో ఇరిగేషన్‌ను విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరమని భావిస్తోంది. ఇక తిరుపతి జిల్లాలో ప్రస్తుతం సుమారు 40 వేల నుంచి 45 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని, వాటిలో సుమారు 65 శాతం విస్తీర్ణం డ్రిప్, స్ప్రింక్లర్ వంటి మైక్రో ఇరిగేషన్ పరిధిలో ఉన్నట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. తిరుపతి జిల్లాలో ఉద్యానరంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సుమారు రూ.1,100 కోట్లు కేటాయించనుంది. హార్టికల్చర్ విస్తీర్ణం పెంపు, మైక్రో ఇరిగేషన్, ప్యాక్‌హౌస్‌లు, కోల్డ్‌చెయిన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఫ్రూట్ బౌల్‌గా కరువు సీమ..

ఇక పది జిల్లాలు, 201 క్లస్టర్లు, 14.41 లక్షల హెక్టర్ల విస్తీర్ణంలో ఉద్యానవన పంటల సాగులోకి తీసుకొని రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 9.6లక్షల మంది రైతులు లబ్ది చేకూరుతుందని భావిస్తున్న ప్రభుత్వం రూ. లక్ష కోట్లతో రాయలసీమ సమగ్ర అభివృద్ధి కి ప్రణాళిక చేస్తోంది. మూడు దశల్లో రాయలసీమ రైజింగ్‌కు ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం మొదటి దశ 2026-27లో రూ 12,066 కోట్లతో 72 క్లస్టర్లలో అభివృద్ధి చేయనుంది.

రెండో దశ 2027-28లో రూ.15,036 కోట్లతో మరో 67 క్లస్టర్లను, మూడో దశ 2028-29లో రూ 13,259 కోట్లతో మిగిలిన 201 క్లస్టర్ల లో సమగ్ర అభివృద్ధి కి సన్నద్ధం అవుతోంది. కరువు సీమను ఫ్రూట్ బౌల్‌గా మార్చే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మామిడి, అరటి, టమోటా, దానిమ్మ, బత్తాయి, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ, ఖర్జూరం, అవకాడో తదితర పంటలతో పాటు కూరగాయల ఉత్పత్తిలో ప్రత్యేక స్థానం పొందేలా కృషి చేస్తోంది.

మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో ఏపీ సర్కార్ మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేయబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీతో పాటు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు పాల్గొననుండగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పటిష్ట భద్రత ఏర్పాట్లు నిర్వహిస్తోంది.

వీడియో చూడండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us