Viral: గాలానికి చిక్కిన భారీ చేప.. వేలంలో పలికిన ధరకు ఒక్కసారిగా కళ్లు జిగేల్!

|

Jul 11, 2022 | 7:45 AM

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ జాలరికి పంట పండింది. సంద్రంలో వల విసరగా.. భారీ చేప ఒకటి గాలానికి చిక్కింది...

Viral: గాలానికి చిక్కిన భారీ చేప.. వేలంలో పలికిన ధరకు ఒక్కసారిగా కళ్లు జిగేల్!
Kachidi Fish
Follow us on

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ జాలరికి పంట పండింది. సంద్రంలో వల విసరగా.. భారీ చేప ఒకటి గాలానికి చిక్కింది. ఇక ఆ చేప వేలం పాటలో ఏకంగా భారీ ధరకు అమ్ముడుపోయింది. ఇంతకీ అసలు కథేంటంటే..!

వివరాల్లోకి వెళ్తే.. కోనసీమ జిల్లాలోని ఓ మత్స్యకారుడి వలకు భారీ చేప చిక్కింది. అది అక్షరాల రూ. 2 లక్షలకు వేలంలో అమ్ముడైంది. దీంతో పండగ చేసుకుంటున్నాడు మత్స్యకారుడు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన మత్స్యకారుడి వలకు కచిడి అనే మగ చేప చిక్కింది. దీన్ని అంతర్వేది మినీ హార్బర్‌లో వేలం పాట పెట్టగా.. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యాపారి రూ. 2 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఈ చేపలోని పొట్ట భాగాన్ని మందులలో ఉపయోగిస్తారని అందువల్ల ఈ చేప ఖరీదు అధికంగా ఉందని వ్యాపారి చెబుతున్నారు. ఈ చేప 23 కేజీల బరువుంది. ఖరీదైన చేప వలకు చిక్కడంతో తన పంట పండినట్టయిందని మత్స్యకారుడు తెగ సంబరపడుతున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..