రాప్తాడు పాఠశాల ఘటన నిందితుడు హేమంత్‌కు HIV టెస్ట్‌లు.. డ్రగ్ విత్‌డ్రాయల్ లక్షణాలు

అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించారు. అతడిలో డ్రగ్ విత్‌డ్రాయల్ లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రక్తపరీక్షల్లో సీడీ4 కౌంట్ తక్కువగా రావడంతో హెచ్‌ఐవీ కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు..

రాప్తాడు పాఠశాల ఘటన నిందితుడు హేమంత్‌కు HIV టెస్ట్‌లు.. డ్రగ్ విత్‌డ్రాయల్ లక్షణాలు
Raptadu School Attack Accused Hemanth

Updated on: Nov 11, 2026 | 8:56 AM

అనంతపురం, నవంబర్ 11: అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం అతడిలో డ్రగ్ విత్‌డ్రాయల్ లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. మరోవైపు రక్తపరీక్షల్లో సీడీ4 కౌంట్ తక్కువగా రావడంతో హెచ్‌ఐవీ సోకిందా? అనే కోణంలోనూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మత్తుపదార్థాలకు అలవాటు పడిన వ్యక్తి వాటి వినియోగాన్ని అకస్మాత్తుగా నిలిపివేసినప్పుడు శరీరం, మెదడుపై ప్రతికూల ప్రభావాలు కనిపించవచ్చు. ఈ పరిస్థితిని డ్రగ్ విత్‌డ్రాయల్‌గా పిలుస్తారు. దీని కారణంగా రక్తపోటులో మార్పులు, గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి, ఆందోళన, మానసిక అస్థిరత, జీర్ణవ్యవస్థ సమస్యలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఏ లక్షణాలు కనిపిస్తున్నాయనేది ఉపయోగించిన మత్తుపదార్థం, వినియోగ కాలం, వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

మంచంపై నుంచి కిందపడిన హేమంత్

అనంతపురం సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న హేమంత్ సోమవారం మంచంపై నుంచి అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది, పోలీసులు అతడిని తిరిగి మంచంపైకి చేర్చారు. డ్రగ్ విత్‌డ్రాయల్‌కు సంబంధించిన లక్షణాల వల్లే ఇలా జరిగి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం చికిత్సలో భాగంగా అవసరమైన మాత్రలు, ఇంజెక్షన్లు అందిస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. మరోవైపు నిందితుడికి నిర్వహించిన రక్తపరీక్షల్లో సీడీ4 కౌంట్ తక్కువగా వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో సీడీ4 కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. హెచ్‌ఐవీ సోకిన వారిలో ఈ కణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో హేమంత్‌కు హెచ్‌ఐవీ సోకిందా? అనే కోణంలోనూ వైద్యులు పరిశీలిస్తున్నారు. అయితే సీడీ4 కౌంట్ తక్కువగా ఉందన్న ఒక్క కారణంతో హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారించలేమని, దానికి ప్రత్యేక నిర్ధారణ పరీక్షలు అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

హైప్రొటీన్ ఆహారం అందిస్తున్న వైద్యులు

నిందితుడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు హైప్రొటీన్ ఆహారాన్ని అందిస్తున్నారు. అవసరమైన వైద్య చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ పరిణామాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి స్పందిస్తూ.. ప్రస్తుతం హేమంత్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. రాప్తాడు పాఠశాల ఘటనలో నిందితుడి ఆరోగ్య పరిస్థితి, వైద్య పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us