MP Margani Bharath: టీడీపీ చర్యలకు నిరసనకు రెడీ అవుతున్న ఎంపీ మార్గాన్ని భరత్.. వైసీపీనేతలకు పిలుపు

|

Oct 20, 2021 | 7:51 AM

MP Margani Bharath: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసిపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతుంది. ఓ వైపు టీడీపీ పార్టీ..

MP Margani Bharath: టీడీపీ చర్యలకు నిరసనకు రెడీ అవుతున్న ఎంపీ మార్గాన్ని భరత్.. వైసీపీనేతలకు పిలుపు
Magarni Bharath.
Follow us on

MP Margani Bharath: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసిపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతుంది. ఓ వైపు టీడీపీ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు వైసీపీ నాయకులు కూడా టీడీపీ నేతలపై ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైస్సార్సీపీ నాయకులకు టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

రాజమండ్రి ఎంపీ.. వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఈరోజు ఉదయం 10గంటలకు వైస్సార్సీపీ నాయకులకు, వార్డ్ ఇంచార్జిలకు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలకు వేమగిరి జంక్షన్ వద్దకు రావలసిందిగా పిలుపునిచ్చారు. వైస్సార్సీపీ ప్రభుత్వం మీద నిందలు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న తెలుగుదేశం పార్టీ చర్యలకు నిరసన చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేపట్టనున్నామని చెప్పారు. ప్రతి ఒక్క వైసీపీ నేతలు, కార్యకర్తలు వేమగిరి జంక్షన్ దగ్గర నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మార్గాన్ని భరత్  విజ్ఞప్తి చేశారు.

Also Read: కలియుగంలో రాజ్యపాలన చేసేవారు ప్రజల కోసం ఏమి చెయ్యాలో చెప్పిన భీష్ముడు