Andhra: ఔను.. ఆ ఇద్దరూ కన్పించడంలేదు..! తెర వెనుక ఏం జరుగుతోంది..

ఔను.. ఆ ఇద్దరూ కన్పించడంలేదు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ఎక్కడ?.. ఆరోపణలు చేసిన వీణ జాడేది?.. ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా ఆ ఇద్దరు అజ్ఞాతవాసంలోకి వెళ్లడం వెనక కతేంటి? తెర వెనుక అసలేం జరుగుతోంది?

Andhra: ఔను.. ఆ ఇద్దరూ కన్పించడంలేదు..! తెర వెనుక ఏం జరుగుతోంది..
Arava Sridhar Controversy

Updated on: Jan 31, 2026 | 10:47 AM

ఈ ఇద్దరి ఆచూకీ కన్పించడంలేదు. కానీ.. సోషల్‌ మీడియాలో వీడియోలతో పాటు ఇద్దరి వెర్షన్‌లు వైరలవుతన్నాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వీడియో మ్యాటర్‌ ఏపీ పాలిటిక్స్‌ను హీటెక్కించింది. వారంలోగా వివరణ ఇవ్వాలని జనసేన అధిష్టానం ఆదేశించిన క్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. కుటుంబసభ్యులకు, పార్టీ నేతలకు,కార్యకర్తలకు ఆయన అందుబాటులో లేకపోవడం, ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి వుండడం వెనుక మతలబు ఏంటి? డీఫ్‌ ఫేక్‌ వీడియోలతో తనను బద్నాం చేశారన్న శ్రీధర్‌, లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారా? ఆ పని మీదే ఉండి వుంటారన్నది అనుచరుల మాట. మరి ఆమె ఎక్కడ? అరవ శ్రీధర్‌పై సంచలన ఆరోపణలు చేసిన వీణ జాడేది?

రాజకీయాలతో ఏ సంబంధంలేదు..తనకు న్యాయం కావాలన్నా వీణ, తనను మోసం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్‌కు శిక్ష పడాలని డిమాండ్‌ చేశారు. మరి వీడియోలు రిలీజ్‌ చేసిన వీణా.. ఎమ్మెల్యేపై ఎందుకని కేసు పెట్టలేదన్నది కొందరి ప్రశ్న. తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్న ఆమె..ఇప్పటి వరకు ఏవైనా ఫిర్యాదులు చేశారా? ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా? అనేది మరో చర్చ. కంప్లేంట్స్‌ ఇచ్చారా ?లేదా? అని ఆమె నుంచి క్లారిటీ లేదు.కానీ ఆమెపై మాత్రం ఇప్పటికే రెండు కేసులు ఫైలయ్యాయి.

జర్నలిస్ట్‌పై దాడికి సంబంధించి వీణపై ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేశారు రైల్వే కోడూరు పోలీసులు.అలాగే MLA శ్రీధర్‌ తల్లి ప్రమీల ఫిర్యాదుపై కూడా విచారణ చేపట్టారు.

మరోవైపు ఎమ్మెల్యే శ్రీధర్‌- వర్సెస్‌ వీణ ఎపిసోడ్‌ ఏపీ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నాయి. ఎమ్మెల్యే శ్రీధర్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు వైసీపీ నేతలు.

ఇది తనకు అరవ శ్రీధర్‌కు మధ్య జరుగుతున్న గొడవే తప్ప పార్టీలకు సంబంధం లేదన్నారు వీణ. తనకు పవన్ కల్యాణ్ అంటే గౌరవం ఉందన్నారు.

ఆవాజ్‌ సరే.. వీణ జాడేది? ఆమె అజ్ఞాతంలోకి వెళ్లడం వెనుక అసలు కారణాలేంటి? కన్పించకుండా కేవలం ఆడియో,వీడియో లీక్స్‌ వదలడంలో మతలబు ఏంటి? డీప్‌ ఫేక్‌ వీడియోలతో తనపై దుష్ర్పచారం చేశారన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా అజ్ఞాతవాసిగా ఎందుకు మారారు? సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోన్న రైల్వే కోడూర్‌ బ్లూస్‌లో ఇంకా ఎలాంటి సంచలనాలు తెరపైకి రానున్నాయి?. నాట్‌ ఓన్లీ రైల్వేకోడూరు…రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎపిసోడే హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..