Vijayawada: విజయవాడ రాజకీయాలు వేడుక్కుతున్నాయి. ‘టీడీపీ టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా’, ‘నాకు వైసీపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి’ అంటూ విజయవాడ ఎంపీ కేశినేని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశినేనిని టార్గెట్ చేస్తూ పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ‘బెజవాడ భల్లూకమా’ అని సంభోదిస్తూ ట్విట్ చేశారు. ఎండల్లో కారెక్కు తావో, కమలం జ్యూస్ తాగుతావో, ఫ్యాన్ వేసుకుంటావో అంటూ పీవీపీ చేసిన ట్వీట్ ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పీవీపీ తన ట్వీట్‌లో ‘బెజవాడ భల్లూకమా.. నీకు చిరెత్తితే చిరిగేది నీ చాట,వుడేది నీ ప్యాంటు..నువ్వేదో మహా ప్రతివ్రతని అంటూ నువ్వు చూపే సోయగాలకు సొంగలు కార్చే విటులు విజయవాడలో ఎవ్వరు లేరు, ఈ ఎండల్లో కారెక్కుతావో, కమలం జ్యూస్ తాగుతావో లేక ఫ్యాన్ ఏసుకుంటావో … రాబోయే నీ దుర్ధినం.. మా అందరి సుదినం ?’ అని రాసుకొచ్చారు.
బెజవాడ భల్లూకమా..
నీకు చిరెత్తితే చిరిగేది నీ చాట,వుడేది నీ ప్యాంటు..నువ్వేదో మహా ప్రతివ్రతని అంటూ నువ్వు చూపే సోయగాలకు సొంగలు కార్చే విటులు విజయవాడలో ఎవ్వరు లేరు, ఈ ఎండల్లో కారెక్కుతావో, కమలం జ్యూస్ తాగుతావో లేక ఫ్యాన్ ఏసుకుంటావో … రాబోయే నీ దుర్ధినం.. మా అందరి సుదినం ?— PVP (@PrasadVPotluri) June 11, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం