Andhra Pradesh: ఏపీలో మరో అతిపెద్ద స్టీల్ ప్లాంట్.. అక్టోబర్ నుంచి కార్యకలాపాలు.. దేశంలోనే అరుదైన రికార్డ్..

ఏపీకి శుభవార్త, రాష్ట్రంలో మరో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే పనులు పూర్తవ్వగా.. అక్టోబర్ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్ధికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందించనున్నాయి. వీటికి సంబంధించిన వివరాలు..

Andhra Pradesh: ఏపీలో మరో అతిపెద్ద స్టీల్ ప్లాంట్.. అక్టోబర్ నుంచి కార్యకలాపాలు.. దేశంలోనే అరుదైన రికార్డ్..
Steel Plant

Updated on: Feb 27, 2026 | 4:34 PM

ఆంధప్రదేశ్‌కు గుడ్ న్యూస్.. ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఉండగా.. మరో స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు కానుంది. ఏపీలో ప్రొటీరీయల్ సంస్థ రూ.1350 కోట్లతో అమోర్పోస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పేందుకు సిద్దమవుతోంది. మెట్ గ్లాస్ ఇండియా పేరుతో దీనిని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. తిరుపతిలో శ్రీసిటీలో దీనిని నెలకొల్పనుండగా.. దేశంలోనే తొలి అమర్ఫోస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ ఇదే కావడం విశేషమని చెప్పవచ్చు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో 200 మంది ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనుండగా.. పరోక్షంగా వేల మందికి లబ్ది చేకూరనుంది.

2026 అక్టోబర్ నాటికి పూర్తి

2026 అక్టోబర్ నాటికి ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్‌ను తిరుపతిలోని శ్రీసిటీలో నెలకొల్పేందుకు ప్రొటీరియల్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా-జపాన్ సంయుక్త సంస్థ అయిన ప్రొటిరియల్ కంపెనీ ఈ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ ద్వారా అల్లాయ్ రిబ్బర్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇప్పటికే ఒప్పందాలు అన్నీ పూర్తవ్వగా.. త్వరలోనే పనులు ప్రారంభించనుంది. 2026 అక్టోబర్ నాటికి అన్నీ పనులు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించేందుకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. స్టీల్ ప్లాంట్‌లో అధునాతన జపాన్ టెక్నాలజీని ఉపయోగిస్తామని, తొలి దశలో ప్రతీ ఏటా 30 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభిస్తామని కంపెనీ సీఈవో శాన్ స్టాక్ వెల్లడించారు.

అనకాపల్లి జల్లాలో మరో స్టీల్ ప్లాంట్

ఇక ప్రొటిరియల్ సంస్థ తిరుపతిలో ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ విషయం అటు ఉంచితే.. మరోవైపు అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టర్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. దీని నిర్మాణానికి మార్చి 7న శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారు అయింది. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌గా ఇది నిలవనుంది. దీని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు దీని నిర్మాణానికి రూ.1.35 లక్షల కోట్ల వ్యయం కానుంది. ఇప్పటికే ఈ కంపెనీకి ఏపీ ప్రభుత్వం భూమి కేటాయించింది. రెండు దశల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో స్థానిక యువతకు భారీగా ఉద్యోగాలు లభించనున్నాయి. వీలైనంత త్వరగా స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేసి కార్యకలాపాలు మొదలుపెట్టేలా ఆర్సెలార్ కంపెనీ సిద్దమవుతోంది. మొత్తానికి ఏపీలో మరో రెండు స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు కానుండటంతో ఆర్ధికంగా, పారిశ్రామికంగా రాష్ట్రానికి ఉపయోగపడనున్నాయని చెప్పవచ్చు. వీటి ఏర్పాటుతో పరోక్షంగా ఎన్నో ఉద్యోగాలు రానున్నాయి.

Follow Us