
ఆవులకు కళేబరాలుగా మార్చి అక్రమంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తు్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. వివరాల్లోకి వెళ్తే.. మార్కాపురంలోని విజయ సినిమాహాలు సమీపంలో ఆవులను వధించి మాంసం విక్రయిస్తున్నట్టు హిందూ ధార్మిక సంఘాల నేతలకు సమాచారం వచ్చింది. దీంతో ఈ విషయాన్ని వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులను వెంటబెట్టుకుని ఆవులను అక్రమంగా ఉంచిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వధించేందుకు దాచి ఉంచిన 62 ఆవులను గుర్తించారు. అప్పటికే వధించిన కొంత ఆవు మాంసంతో పాటు రహస్యంగా దాచి ఉంచిన గోవులను గుర్తించారు.
ఈ సమాచారాన్ని ప్రకాశంజిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌పి ఎస్పీ ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణ ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు, వైద్యులను పిలిపించి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాంసాన్ని ట్రాక్టర్లల్లో వేసుకుని డంపింగ్ యార్డుకు తరలించి పూడ్చి పెట్టారు. గోమాంసం విక్రయిస్తున్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు: పోలీసులు
మూగజీవాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మూగజీవాల అక్రమ రవాణా, వధలపై నిఘాను ఉంచామన్నారు. రెండు జిల్లాల్లో పశుసంవర్థక, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో 53 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాస్థాయిలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి.శ్రీధర్‌ను నోడల్ అధికారిగా నియమించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు, చెక్‌పోస్టులు, టోల్‌గేట్స్, ప్రధాన రహదారుల్లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గోవులను అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే జేఏసీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని ఎస్‌పి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.