కూంబింగ్ చేస్తుండగా కలవరం..! భారీగా పేలుడు పదార్థాలు గుర్తింపు..

అల్లూరి జిల్లాలో భద్రతా బలగాలు ఏజెన్సీని జల్లెడ పడుతున్నాయి. ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతుండడం.. మరోవైపు మావోయిస్టు టీం సభ్యులు సంచరిస్తున్నారన్న సమాచారంతో నిఘా పెంచారు పోలీసులు. ఏఓబిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే.. అడవిలో కూంబింగ్ చేస్తున్న బలగాలకు.. భారీ మావోయిస్టు డంప్ కనిపించింది. జీకే వీధి అటవీ ప్రాంతంలో భారీ మావోయిస్టు డంప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

కూంబింగ్ చేస్తుండగా కలవరం..! భారీగా పేలుడు పదార్థాలు గుర్తింపు..
Alluri District
Follow us

| Edited By: Srikar T

Updated on: May 25, 2024 | 5:33 PM

అల్లూరి జిల్లాలో భద్రతా బలగాలు ఏజెన్సీని జల్లెడ పడుతున్నాయి. ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతుండడం.. మరోవైపు మావోయిస్టు టీం సభ్యులు సంచరిస్తున్నారన్న సమాచారంతో నిఘా పెంచారు పోలీసులు. ఏఓబిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే.. అడవిలో కూంబింగ్ చేస్తున్న బలగాలకు.. భారీ మావోయిస్టు డంప్ కనిపించింది. జీకే వీధి అటవీ ప్రాంతంలో భారీ మావోయిస్టు డంప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పనసల బంధ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా బయటపడింది ఈ భారీ డంప్. ఈ డంపులో స్టీల్ క్యారేజ్ మందు పాతరలు 6, డైరెక్షనల్ మైన్స్ 2, ఎలక్ట్రికల్ వైరు 150మీటర్లు, మేకులు 5 కిలోలు, విప్లవ సాహిత్యం ఉన్నాయి.

ఏజెన్సీలో మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు సంచరిస్తున్నారని ఇటీవల పోలీసుల ప్రకటిస్తూ పోస్టర్లు కూడా వేశారు. ఈ క్రమంలో డంప్ బయటపడటం తీవ్ర కలకలం రేపుతుంది. మావోయిస్టు డంపు పట్టుబడిన తర్వాత అల్లూరి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అల్లూరి ఏజెన్సీలో కూడా మావోయిస్టులపై ఆదరణ తగ్గిందని.. మావోయిస్టులకు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లొంగిపోతే ఉపాధి మార్గాలు చూపిస్తామన్నారు ఎస్పీ తుహిన్ సిన్హా. మావోయిస్టు డంపు ఆ ప్రాంతంలో ఉండడానికి.. దాని వెనుక ఎవరు సహకారం అందించాలని లోతుగా విచారిస్తున్నామని అన్నారు ఎస్పీ తుహిన్ సిన్హా. ఎస్పీ తుహిన్ సిన్హాతో పాటు చింతపల్లి సబ్ డివిజన్ అదనపు ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డంపు రికవరీ చేసిన ఎస్సై జి.మాడుగుల, ఏ.శ్రీనివాసరావు, సీలేరు ఎస్సై రామకృష్ణ, ఆర్ఎస్ఐ జాన్ రోహిత్‎లకు జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రం, నగదు రివార్డులను అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్