Police Case File: మాజీ ప్రజాప్రతినిధి వివాహ వార్షికోత్సవంలో అశ్లీల నృత్యాలు.. ఆలస్యంగా వెలుగులోకి వీడియోలు..

|

Feb 19, 2021 | 3:34 PM

Marriage Anniversary: చిన్నపాటి కార్యక్రమాలకే రాజకీయ నేతలు ఎంతగానో హడావుడి చేస్తారు. అలాంటిది సొంత కార్యక్రమం అయితే మామూలు రచ్చ ఉండదు.

Police Case File: మాజీ ప్రజాప్రతినిధి వివాహ వార్షికోత్సవంలో అశ్లీల నృత్యాలు.. ఆలస్యంగా వెలుగులోకి వీడియోలు..
Follow us on

Marriage Anniversary: చిన్నపాటి కార్యక్రమాలకే రాజకీయ నేతలు ఎంతగానో హడావుడి చేస్తారు. అలాంటిది సొంత కార్యక్రమం అయితే మామూలు రచ్చ ఉండదు. తాజాగా ఓ మాజీ సర్పంచ్ తన 50వ వివాహ మహోత్సవం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. అంతేకాదు.. అశ్లీల నృత్యాలు ఏర్పాటుచేశారు. ఈ నృత్యాలకు సంబంధించిని వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకెళితే.. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొడేరు మండలం పెన్నడపాలెంలో మాజీ సర్పంచ్ చేబ్రోలు రామకృష్ణ దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం ఈనెల 11వ తేదీన జరిగింది. అయితే ఈ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రామకృష్ణ గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశాడు. అంతేకాదు.. అశ్లీల నృత్యాలను కూడా ఏర్పాటు చేశారు. 11వ తేదీన రాత్రంతా అశ్లీల నృత్యాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రాగా.. దీనిపై పాలకోడేరు పీఎస్‌లో వీఆర్వో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు చేబ్రోలు రామకృష్ణతో పాటు మరో నలుగురిపై ఐపీసీ సెక్షన్ 294, 114, రెడ్ విత్ 34 ఐపీసీ, సెక్షన్ 6 ఆఫ్ ఇండీసెంట్ ప్రివలైజేషన్ ఆఫ్ ఉమన్, ప్రొవిజన్ యాక్ట్ 1986 సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read:

Anushka Shetty Tollywood Actress: అందానికి అందం, అభినయానికి అభినయం.. అందుకే చిత్రసీమలో శిఖరాగ్రం

Multan Sun Temple: కృష్ణుడు కొడుకు సాంబుడు నిర్మించిన పాక్‌లోని ముల్తానా సూర్య దేవాలయం.. విశిష్టత ఏమిటంటే..!