Andhra Pradesh: రాజులు అపారమైన సంపదను దాచారంట.. పర్యాటక ప్రాంతంలో గుప్త నిధుల కోసం అన్వేషణ..

| Edited By: Shaik Madar Saheb

Nov 04, 2023 | 5:06 PM

దట్టమైన అడవులు మధ్య ఉన్న 3500 అడుగుల గల ఈ ఎత్తయిన దుర్గాన్ని ప్రాణలకు తెగించి పురుషులు మాత్రమే ఎందుకు వెళతారు.. ఇంతకీ అక్కడ ఏముంది.? నిన్న మొన్నటివరకు అక్కడకు వెళ్ళేది పచ్చని పర్యావరణాన్ని ఆస్వాదించేందుకు.. కానీ ఇటీవల అక్కడకు కొందరు వెళుతున్నది మాత్రం నిధుల వేటకోసం. ఆ వివరాలేంటో తెలుసుకోండి.. తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాంతం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్గం ఉంది.

Andhra Pradesh: రాజులు అపారమైన సంపదను దాచారంట.. పర్యాటక ప్రాంతంలో గుప్త నిధుల కోసం అన్వేషణ..
Durgam Konda
Follow us on

దట్టమైన అడవులు మధ్య ఉన్న 3500 అడుగుల గల ఈ ఎత్తయిన దుర్గాన్ని ప్రాణలకు తెగించి పురుషులు మాత్రమే ఎందుకు వెళతారు.. ఇంతకీ అక్కడ ఏముంది.? నిన్న మొన్నటివరకు అక్కడకు వెళ్ళేది పచ్చని పర్యావరణాన్ని ఆస్వాదించేందుకు.. కానీ ఇటీవల అక్కడకు కొందరు వెళుతున్నది మాత్రం నిధుల వేటకోసం. ఆ వివరాలేంటో తెలుసుకోండి.. తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాంతం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్గం ఉంది. వెంకటగిరి ప్రాంతం నుంచి దట్టమైన అటవీ ప్రాంతం గుండా ఈ దుర్గానికి వెళుతుంటారు. ముందుగా 2500 అడుగులు ఎత్తు ఉన్న ఓ కొండని ప్రాణాలకు తెగించి ఎక్కిన తర్వాత, సుమారు మరో వెయ్యి అడుగులు 300 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఇక్కడి చేరుకున్న తరువాత అసలు కథ మొదలవుతుంది. దుర్గానికి చేరుకోగానే శిథిలావస్థలో ఉన్న రాచరిక భవనాలు, పాడుబడ్డ కలివేలమ్మ, ఆంజనేయస్వామి దేవాలయాలు దర్శనమిస్తాయి.

గుప్త నిధులు దాచారని ప్రచారం..

రాజుల కాలంలో రహస్య నివాసం కోసం ఈ కొండపై కొన్ని భవనాలు కట్టించారు. ఈ భవనాలు క్రింద విలువైన బంగారం, వజ్ర, వైడుర్యాలు ఉన్నాయనే విషయం ప్రచారంలో ఉంది. శతాబ్దాల క్రితం నుంచి గుప్త చోదకులు నిధుల కోసం దుర్గం మొత్తం జల్లెడ పడుతుంటారు. ఈ కొండపై ఉన్న శిధిలమైన కలివెలమ్మ గుడిని సైతం సుమారు 20 అడుగుల లోతున నిధికోసం గుప్త చోదకులు గుంతలు తవ్విన దృశ్యాలు మనకు కనిపిస్తాయి.

Tirupati Durgam

ఈ దుర్గంపై బ్రిటీషు వారు నివాసం..

పూర్వం వెంకటగిరి దుర్గానికి సరైన దారి కూడా లేదు. ఎందుకంటే ఇది ఒక రహస్య స్థావరంగా అప్పటి రాజ్యాలు వినియోగించుకునేవారు. శత్రువుల కంటపడకుండా ఈ మార్గాన్ని కూడా రహస్యంగా తయారు చేసుకున్నారు. బ్రిటిష్ పాలన కొనసాగుతున్న టైంలో అప్పటి బ్రిటిష్ వారికి ఈ దుర్గం వచ్చి వారి వేసవి విడిదిగా కూడా ఈ దుర్గాన్ని వినియోగించుకునేవారు.

Venkatagiri Durgam

ఓ పెద్ద ఫిరంగి కూడా..

సాధారణంగా రాజాల ఆయుధశాలలో మాత్రమే ఫిరంగి ఉంటుంది. 3500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపై ఫిరంగి ఎలా అమర్చారో ఇక్కడ అర్దం కాని విషయం..

సాధారణ ఉష్ణోగ్రత కంటే 4 డిగ్రీలు తక్కువ..

దుర్గం ప్రాంతంలో భూమి మీద ఉన్న ఉష్ణోగ్రత కంటే 4 డిగ్రీల తక్కువ ఉంటుంది. చుట్టూ పర్వతాలు, లోయలు, ఆకాశం తాకుతునట్టు మేఘాలు ఉంటూ ఎంతో సౌందర్యంగా, సుందరంగా ఉంటుంది. అంతే కాక ఈ దుర్గం నుంచి చూస్తే చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు కనిపిస్తాయి. అంటే ఎంత ఎత్తులో ఈ కొండ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని పర్యాటకానికి వీలుగా అభివృద్ధి చేస్తే పరిసర ప్రాంతాల్లో సైతం ఎంతో అభివృద్ధి జరుగుతుందని చాలారోజుల నుంచి స్థానికులు పేర్కొంటున్నారు. దశాబ్ధాలుగా కోరుతున్నా.. అలా జరగలేదు కానీ.. ఇటీవల కాలంలో అక్కడకు వస్తున్న వారిలో కొంతమంది నిధుల వేటకోసం వస్తున్న సందర్భాలు అనేకం వెలుగు చూశాయి. తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. రాత్రి వెళల్లోనే ఈ నిధుల కోసం కొందరు అక్కడ తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేవన్న కారణంగా అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదు. పురావస్తు శాఖ దీనిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Durgam

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..