డోకిపర్రు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్… కృష్ణారెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంస…

కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని డోకిపర్రు వెంకటేశ్వరస్వామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. మెగా కృష్ణారెడ్డి దంపతులు జనసేనానికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.

డోకిపర్రు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్... కృష్ణారెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంస...

Edited By:

Updated on: Dec 12, 2020 | 3:00 PM

కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని డోకిపర్రు వెంకటేశ్వరస్వామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. మెగా కృష్ణారెడ్డి దంపతులు జనసేనానికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేదపండితుల ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మెగా కృష్ణారెడ్డి, పిచ్చిరెడ్డి డోకిపర్రు గ్రామానికి ఎన్నో సేవలు చేస్తున్నారని, భవిష్యత్‌లో మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు. గ్రామంలో నీటి, గ్యాస్ సరఫరా సేవలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. రెండు, మూడు ఏళ్లుగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని, డోకిపర్రు‌కు రావాలని అనుకున్నానని అన్నారు. భవిష్యత్‌లో డోకిపర్రు వెంకటేశ్వర స్వామి ఆలయం మరింత గొప్పగా విరాజిల్లుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఆయన వెంట నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.