బనగానపల్లె నేతల మధ్య ముదురుతున్న మాటల తూటాలు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు.. డిబెట్‌కి సిద్దమని ప్రకటన..

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి మధ్య మాటల యుద్దం జరుగుతుంది. దీంతో ఒకరిపై ఒకరు

  • uppula Raju
  • Publish Date - 9:30 am, Fri, 22 January 21
బనగానపల్లె నేతల మధ్య ముదురుతున్న మాటల తూటాలు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు.. డిబెట్‌కి సిద్దమని ప్రకటన..

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి మధ్య మాటల యుద్దం జరుగుతుంది. దీంతో ఒకరిపై ఒకరు మాటల తూటాలను విసురుకుంటున్నారు. టీవీ9 తో ఇద్దరు మాట్లాడుతూ.. తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ డిబెట్‌కు సిద్దమని ప్రకటించారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి 22 కేసులో నిందితుడని, అన్నింటికీ FIR చూపిస్తానని, భూ కబ్జాదారుడని ఆరోపించారు. బనగానపల్లెలోని ఆయన ఇల్లు కూడా కబ్జా చేసిందే అన్నారు. అలాంటి బీసీ జనార్దన్ రెడ్డికి నన్ను విమర్శించే అర్హత లేదని ఎగతాళి చేశారు.

కత్తి పట్టుకుంటానని అంటున్న బీసీ జనార్దన్ రెడ్డి బెదిరింపులకు తాను భయపడనని, అతడు చేసే అవినీతి అక్రమాలను నిరూపించేందుకు టీవీ9 లో డిబేట్‌కు సిద్ధమని ప్రకటించాడు. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశాడని ఆరోపించారు. ప్రతి రియల్ ఎస్టేట్ వెంచర్ నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే అక్రమ మైనింగ్‌తో అతి ప్రాచీన ఆలయాలకు ముప్పు పొంచి ఉందని విమర్శించారు. ఎమ్మెల్యే అక్రమాలను ఎత్తిచూపిన వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఆయన అక్రమాలను నిరూపించడానికి టీవీ9 లో డిబేట్‌కు సిద్ధమని ప్రకటించారు.

వేడెక్కిన బెంగాల్ రాజకీయం.. బీజేపీ-టీఎంసీ ఎత్తుకుపైఎత్తులు.. ఎమ్మెల్యే రాజీనామా తిరస్కరణ