Corona: దారుణం.. కరోనా సోకిందని ఇంట్లో నుంచి బయటకు పంపిన యజమాని.. శ్మశానంలో తల్లీకొడుకులు..

|

Apr 21, 2021 | 12:48 PM

Mother, son in cemetery: కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఈ వైరస్ గురించి ప్రతి ఒక్కరిలో ఆందోళన నెలకొంది. ఓ వ్యక్తి నుండి మరో వ్యక్తికి సంక్రమించే

Corona: దారుణం.. కరోనా సోకిందని ఇంట్లో నుంచి బయటకు పంపిన యజమాని.. శ్మశానంలో తల్లీకొడుకులు..
Mother, son in cemetery
Follow us on

Mother, son in cemetery: కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఈ వైరస్ గురించి ప్రతి ఒక్కరిలో ఆందోళన నెలకొంది. ఓ వ్యక్తి నుండి మరో వ్యక్తికి సంక్రమించే వ్యాధి కావడంతో అప్రమత్తంగా ఉండటంలో తప్పులేదు. కానీ బాధితుల పట్ల అమానవీయంగా ప్రవర్తించడం మానవత్వానికే మచ్చ తెచ్చిపెడుతోంది. ఇళ్లల్లో అద్దెకు ఉన్న వాళ్లకు ఎవరికైనా కరోనా సోకితే ఆ ఇంటి యజమానులు ప్రవర్తిస్తున్న తీరు.. ఆగ్రహానికి గురిచేస్తోంది. కరోనా సోకిన వారిన కేంద్రానికో ఆసుపత్రికో వెళ్లిపోండి.. తగ్గిన తరువాతే రండి అంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారు. దీంతోపాటు పలు గ్రామాల్లో అయితే కరోనా వ్యాధి గ్రస్తులను ఊళ్లలోకి కూడా అనుమతించటం లేదు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఇటాంటి అమానవీయ ఘటనే చోటుచేసుకుంది.

కరోనా అనుమానంతో అద్దెకు ఉంటున్న వీరమ్మ అనే వృద్ధురాలు, ఆమె కొడుకును యజమానులు ఇంటి నుంచి బయటకు గెంటేశారు. స్థానికులు వారిని గ్రామంలోని శ్మశానంలో వదిలిపెట్టారు. దీంతో ఓ రాత్రంత వారు స్మశానంలోనే గడపాల్సి వచ్చింది. ఈ విషయం కాస్త చివరకు పోలీసులకు చేరింది. వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు.. ఆ ఇంటి యాజమానిని హెచ్చరించారు. అనంతరం గ్రామస్తులకు కరోనాపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత వీరమ్మ, అతని కుమారిడిని ఆటోలో అద్దె ఇంటికి తరలించారు. కాగా ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఏపీలో కూడా భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిత్యం 10వేలకు పైగా కేసులు, పదుల సంఖ్యలో మరణాలు సంభిస్తున్నాయి. దీంతో కరోనా నిబంధనలు పాటించకపోతే జరిమానా విధిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా.. ఏపీలో పాఠశాలలను కూడా మూసివేశారు. పది, ఇంటర్ పరీక్షలను కరోనా నిబంధనలతో నిర్వహిస్తామని వెల్లడించింది.

Also Read:

Fish Market: ఆకివీడు చేపల మార్కెట్‌లో ఆక్వా రైతుల పరిస్థితి దారుణం… కిలో చేపలు కేవలం రూ.40 మాత్రమే.!

Father died: తల్లిదండ్రులు మందలించారని కాల్వలో దూకిన కూతురు.. బిడ్డను కాపాడిన తండ్రి మృతి