Vizianagaram: బైక్‌పై వెళ్తున్న యువకుడికి రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్‌.. తెరిచి చూడగా..

ఓ యువకుడు బైక్‌పై వెళుతున్నాడు.. ఇంతలో రోడ్డు పక్కన ఓ బ్యాగు కనిపించింది. ఆ బ్యాగులో లావుగా ఉండటంతో.. ఏవో ఉన్నట్లు ఆ యువకుడికి ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే వెళ్లి ఆ బ్యాగు తీసి చూసి అవాక్కయ్యాడు.. అందులో ఏమున్నాయంటే..?

Vizianagaram: బైక్‌పై వెళ్తున్న యువకుడికి రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్‌.. తెరిచి చూడగా..
Suraj

Updated on: May 11, 2024 | 12:06 PM

సొసైటీ అంతా పొల్యూట్ అయిపోయింది. ఎక్కడైనా మంచి జరిగితే.. దాన్ని హైలెట్ చేయాల్సి వస్తుందటే.. పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోసం, వెన్నుపోటు, దురాశ వంటి గుణాలతో కొందరు మనుషులు ఉన్మాదుల్లా మారిపోతున్నారు. ఇలాంటి రోజుల్లో నిజాయితీ ఉన్న వ్యక్తులు కనిపించడం చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తే ఈ యువకుడు. ఇతను ద్విచక్రవాహనం నడుపుతూ వెళ్తుండగా.. రోడ్డు పక్కన ఓ బ్యాగ్ కనిపించింది. బ్యాగులో ఏవో ఉన్నట్లు అనిపించడంతో.. బైక్ ఆపి వెళ్లి దాన్ని ఓపెన్ చేశాడు. లోపల డబ్బు ఉండటంతో ఆశ్చర్యపోయాడు. అయితే అతడు ఆ దొరికిన సొమ్మును కాజేయాలని అనుకోలేదు. నిజాయితీగా వ్యవహరించి.. పోలీసులకు సమాచారమిచ్చాడు. వారి సాయంతో బ్యాగు పోగుట్టుకున్న బాధితుడికి తిరిగి దాన్ని అప్పగించాడు.

వివరాల్లోకి వెళ్తే..  ఒడిశా బోర్డర్‌లోని గంజాం జిల్లా కళ్లికోట సమితిలో ఉన్న మధురకు చెందిన సూరజ్‌..  కార్పెంటరుగా పని చేస్తున్నాడు. అతడు 2 రోజుల క్రితం బైక్‌పై సొంత ఊరి నుంచి నిర్మలఝర్‌కు వెళ్తుండగా.. దారిలో ఓ పెట్రోలు బంకు దగ్గర్లో.. రోడ్డు పక్కన ఓ బ్యాగు పడి ఉంది. అతడు బైక్ ఆపి వెళ్లి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా.. అందులో డబ్బులతో పాటుగా మెడిసిన్, కొన్ని డాక్యుమెంట్లు కనిపించాయి. బ్యాగులో డబ్బులు ఉండటంతో ఆ యువకుడు వెంటనే పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పాడు.

కళ్లికోట పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని..  అందులో రూ.90 వేలు ఉన్నట్లు గుర్తించారు. డాక్యుమెంట్ల ఆధారంగా.. ఆ బ్యాగు ఏపీలోని విజయనగరంనకు చెందిన చెందిన మెడికల్‌ రిప్రజంటేటివ్‌దిగా గుర్తించారు. వెంటనే అతడికి సమాచారం ఇచ్చి ఆ బ్యాగును తిరిగి అందజేశారు. నిజాయితీగా వ్యవహరించిన సూరజ్‌ను పోలీసులతో పాటు స్థానికులు ప్రశంసించారు. ఎదుటివాళ్లను ఏమార్చి దోచుకునే ఈ రోజుల్లో.. ఇంత నిజాయితీగా డబ్బులు తిరిగి అప్పగించినందుకు యువకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..