దుర్గగుడి హుండీ చోరీ కేసులో కొత్త మలుపు

బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ హుండీలో చోరీకి పాల్పడిన కేసు కొత్త మలుపు తిరిగింది. హుండీ లెక్కింపులో చోరీకి పాల్పడిన కేసులో సింహాచలం అన్నపూర్ణ అనే మహిళతో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారంతో పాటు రూ.10వేల నగదు కూడా ఎత్తుకెళ్లినట్లు పోలీసుల నిర్దారణలో వెల్లడైంది. అయితే చోరీ చేసిన నగదును మార్గమధ్యలో అన్నపూర్ణ మరో ఉద్యోగికి అందజేసింది. ఈ కేసుకు సంబంధించి అన్నపూర్ణతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. […]

  • Anil kumar poka
  • Publish Date - 4:23 pm, Thu, 6 June 19
దుర్గగుడి హుండీ చోరీ కేసులో కొత్త మలుపు

బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ హుండీలో చోరీకి పాల్పడిన కేసు కొత్త మలుపు తిరిగింది. హుండీ లెక్కింపులో చోరీకి పాల్పడిన కేసులో సింహాచలం అన్నపూర్ణ అనే మహిళతో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారంతో పాటు రూ.10వేల నగదు కూడా ఎత్తుకెళ్లినట్లు పోలీసుల నిర్దారణలో వెల్లడైంది. అయితే చోరీ చేసిన నగదును మార్గమధ్యలో అన్నపూర్ణ మరో ఉద్యోగికి అందజేసింది. ఈ కేసుకు సంబంధించి అన్నపూర్ణతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆలయ ఈవో కోటేశ్వరమ్మ స్పందించారు. దుర్గగుడిలో నిఘాను మరింత పటిష్టం చేస్తామన్నారు. హుండీ లెక్కింపు విషయంలో మరింత భద్రత పెంచుతామని ఆమె తెలిపారు.