
ప్రియురాలిపై కోపంతో ఆమెపై ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే స్థానికంగా నివసిస్తున్న విజయ్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి గత రెండేళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పండింది. అయితే కొన్నాళ్ల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇద్దరికి పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే తాజాగా ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో మహిళపై కోపం పెంచుకున్న విజయ్ ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. అనుకున్నట్టు ప్రియురాలిని ఆటోలో ఎంక్కించుకొని బయల్దేరాడు. సిరిగ్గా ధనలక్ష్మిపురం దాటి కాస్త దూరం వచ్చాక తనతో తెచ్చుకున్న పెట్రోల్ తీసి మహిళపై పోశాడు. ఈ క్రమంలో కాస్త పెట్రోల్ పోసే విజయ్ పై కూడా పడింది. అది చూసుకోకుండా లైటర్ వెలిగించి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు విజయ్ దీంతో మహిళతో పాటు అతనికి కూడా మంటలు అంటుకున్నాయి.
ఇక ఏం చేయాలో అర్థం కాక ఇద్దరూ వెంటనే పక్కనే ఉన్న కాలువలో దూకేశారు. దీంతో ఇద్దరికీ ప్రాణ హాని తప్పింది. ఆటో మాత్రం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. గమనించిన స్థానికులు ఇద్దరిని నీటిలోంచి బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి భర్త చనిపోయాడని, ఇద్దరు పిల్లకుకూడా ఉన్నట్టు గుర్తించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.