Navy Vinyasalu Vishakapatna
-
-
నేవీ డే వేడుకలకు విశాఖపట్టణం సాగర తీరం రెడీ అవుతోంది. డిసెంబర్ 4వ తేదీన జరగనున్న ఈ వేడుకలను పురస్కరించుకొని తూర్పునావిదళం ఆధ్వర్యంలో నమూనా విన్యాసాలు నిర్వహించారు. యుద్ధ సమయంలో నావికాదళం ఎలా స్పందిస్తుంది.. శత్రువులపై ఎలా ఎదురుదాడికి దిగుతుందో విన్యాసాల రూపంలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
-
-
సోమవారం నమూనా విన్యాసాలు నిర్వహించారు. గగనంలో యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతూ బాంబులు వేయడం వంటి విన్యాసాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రదర్శనలు చూడటానికి పెద్దఎత్తున నగర ప్రజలు తరలివచ్చారు. సాయంత్రం సమయంలో సముద్రంలో యుద్ధ నౌకలు విద్యుత్తు వెలుగులతో కనువిందు చేశాయి.
-
-
ప్రతి ఏటా డిసెంబర్ 4వ తేదీన నేవీడే జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో విశాఖ తూర్పు తీరంలో నేవీ డే వేడుకలకు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. భారత నౌకాదళం యొక్క పాత్ర, విజయాలను గుర్తించడానికిభారత నౌకాదళ దినోత్సవం జరుపుకుంటారు. 1971లో ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్‌పై ఆపరేషన్ ట్రైడెంట్ ప్రారంభించిన జ్ఞాపకార్థం కూడా ఈ రోజు జరుపుకుంటారు.
-
-
నావి డే వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న రిహార్సల్స్ నగరవాసులను అబ్బురపరుస్తున్నాయి. భూమి, ఆకాశంతో పాటు సముద్ర జలాలపై చేస్తున్న విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. విశాఖపట్టణం నావికాదళ ఆయుధ సంపత్తిని, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు అన్ని కూడా విపత్తుల సమయాల్లో ఏ విధంగా సహాయక చర్యలు అందిస్తాయో ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు.
-
-
భారత నావికా దళానికి వెన్నెముకగా తూర్పు నావికా దళం సేవలు అందిస్తోంది.1968 మార్చి 1న విశాఖ ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం( ఈఎన్సీ ) కార్యకలాపాలు ప్రారంభమై చరిత్రకు శ్రీకారం చుట్టింది. 1971 మార్చి1న ఈఎన్సీ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ నియామక శకం మొదలైంది. క్రమక్రమంగా ఈఎన్సీ విస్తరించింది.1971 నవంబర్ 1 నుంచి ఈఎన్సీ ఫ్లీట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..