
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరులో తొలి విజయాన్ని నమోదు చేసింది. నందికొట్కూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా వైసీపీ అభ్యర్థి ఎస్. ఫాతిమా బీ విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 2,634 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
నందికొట్కూరు మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉండగా, వాటిలో 23 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. మిగిలిన 9 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మున్సిపాలిటీలో వైసీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఆధిక్యం కొనసాగుతున్న నేపథ్యంలో నందికొట్కూరులో వైసీపీ విజయం సాధించడం ఆ పార్టీకి ఊరటనిచ్చింది. ఛైర్‌పర్సన్‌గా ఫాతిమా బీ గెలుపుతో పాటు, మెజారిటీ వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం నందికొట్కూరు ఫలితాల్లో ప్రత్యేకంగా నిలిచింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీసినప్పటికీ.. ఇక్కడ ఆ పార్టీ ఘన విజయం సాధించడంలో యువ నేత బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి కీలక భూమిక పోషించినట్లు తెలుస్తోంది.