Nandamuri Balakrishna: జగన్ పాలనపై బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా టీవి9కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన..

Nandamuri Balakrishna: జగన్ పాలనపై బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?

Updated on: Jun 11, 2021 | 1:33 PM

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా టీవి9కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన.. తన సినీ కెరీర్, తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బాలకృష్ణ ఆరోపించారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో సొంతంగా వనరులను ఏర్పాటు చేయడమే కాకుండా.. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తెలంగాణకు ధీటుగా తీసుకొచ్చారన్న బాలకృష్ణ… ప్రస్తుత పరిస్థితులు వైసీపీ ప్రభుత్వం పాలనకు అడ్డం పడుతున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే కరోనా పరిస్థితులను తెలంగాణ సర్కార్ ధీటుగా ఎదుర్కుంటోందని.. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని బాలకృష్ణ తెరాస ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.

Also Read:

పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..