వర్షాలు కురుస్తాయా..? వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించినప్పటికీ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు, ఉక్కపోత ఇబ్బంది పెడుతుండగా.. మరోవైపు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

వర్షాలు కురుస్తాయా..? వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Andhra Pradesh Weather Update

Updated on: Jun 17, 2026 | 1:20 PM

నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. జూన్ 15, 2026 వ తేదీ నాటికి, నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 18° ఉత్తర అక్షాంశం /60° తూర్పు రేఖాంశం, 18° ఉత్తర అక్షాంశం /65° తూర్పు రేఖాంశం, 18° ఉత్తర అక్షాంశం /70° తూర్పు రేఖాంశం, హర్నై, సోలాపూర్, హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, ఫుల్‌బని, రాంచీ, జముయి, ముజఫర్‌పూర్, 28.3° ఉత్తర అక్షాంశం /83° తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. రాబోయే 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో, తూర్పు విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతం నుండి కేరళ తీరం వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర తమిళనాడు నుండి లక్షద్వీప్ వరకు విస్తరించి ఉంది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :

బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది.

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ :-

బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

Follow Us