MLC Challa Ramakrishnareddy : ఎమ్మెల్సీ చల్లా రామక‌ృష్ణారెడ్డి కన్నుమూత.. విషాదంలో వైసీపీ నేతలు..

|

Jan 01, 2021 | 11:09 AM

MLC Challa Ramakrishnareddy : వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుముశారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన

MLC Challa Ramakrishnareddy : ఎమ్మెల్సీ చల్లా రామక‌ృష్ణారెడ్డి కన్నుమూత.. విషాదంలో వైసీపీ నేతలు..
Follow us on

MLC Challa Ramakrishnareddy : వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుముశారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడ్డ ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాగా, శనివారం కర్నూలు జిల్లా అవుకులో చల్లా రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.

2014 ఎన్నికలకు ముందు వరకు చల్లా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరాడు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చల్లా రామకృష్ణారెడ్డికి కార్పొరేషన్ పదవిని ఇచ్చారు. పదవి విషయంలో అసంతృప్తిగా ఉన్న ఆయన.. 2019లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రామకృష్ణా రెడ్డికి భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.