రాజకీయ నాయకుడు అంటే ఎప్పుడు మంది మార్భలము ఉంటుంది. అందులోకి ఎమ్మెల్యే అయితే ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్ లు కూడా ఉంటారు. కానీ ప్రతి వ్యక్తికి సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా ముఖ్యమే. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజక వర్గం వైసిపి ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ కర్ర సాములో ప్రావీణ్యం సంపాదించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కొవ్వాడ గ్రామంలో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఎమ్మెల్యే కర్ర సాముతో సందడి చేశారు. కార్యకర్తలు కోరిక మేరకు కర్రసాము చేసి అలరించారు. ఎప్పుడో యుక్త వయసులో ఉండగా సరదాగా నేర్చుకున్న కర్ర సామును కార్యకర్తల మద్య ప్రదర్శించటంతో గ్రామములో ఎమ్మెల్యే కర్ర సాము చూసిన వారంతా ఔరా అనుకున్నారు. ఎప్పుడూ సభలు,సమావేశాలు, రాజకీయ కార్యక్రమాలతో బిజీగా కనిపించే తమ ఎమ్మెల్యే కర్రసాము చెయ్యటo చూసిన జనాలు మనకు బాగా తెలిసిన వ్యక్తిలో కూడా తెలియని వ్యక్తి ఉంటాడని ఎమ్మెల్యే నిరూపించారని నియోజక వర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..