తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్లిన బాలకృష్ణ, అక్కడి నుంచి రోడ్డు మార్గాన హిందూపురం చేరుకున్నారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాలయ్యకు ఘనస్వాగతం పలికారు. వివాహ వేడుకలో పాల్గొనడానికి ముందు బాలయ్య.. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఐదేళ్లలో నేను చేసిన అభివృద్ధి పనులను అని గెలిపించాయని.. ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని స్ఫష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా.. గతంలో లాగానే హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. చిలమత్తూరు మండలంలో చాలాచోట్ల నీటి సమస్యలు ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఇకపై ప్రతివారం నియోజకవర్గంలో పర్యటిస్తానని..ప్రజల సమస్యల పరిస్కారం అయ్యేలా దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.