Temple Vandalism: చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైంది.. దేవుళ్ల విగ్రహాల ధ్వంసం కేసులో కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి వెల్లంపల్లి..

Temple Vandalism: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆంద్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం..

Temple Vandalism: చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైంది.. దేవుళ్ల విగ్రహాల ధ్వంసం కేసులో కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి వెల్లంపల్లి..

Edited By:

Updated on: Jan 18, 2021 | 1:22 PM

Temple Vandalism: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆంద్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దేవుడు అంటే భయం, భక్తి లేనే లేవని దుయ్యబట్టారు. ఆ కారణంగా దేవుళ్లను, ఆలయాలను అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆలయాలపై దాడులు, దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసంపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయాల అంశంపై టీడీపీ, బీజేపీ నేతలు మాట్లాడిన తీరు తీవ్ర ఆక్షేపణీయం అని అన్నారు. ఆలయాలపై దాడుల వెనుక ఎవరున్నారో డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారని చెప్పారు. డీజీపీ ప్రకనటపై అభ్యంతరం ఉంటే.. కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవచ్చునని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.

ఆలయాలపై దాడుల కేసుల్లో టీడీపీ నేతల ప్రమేయం రుజువు కావడంతో చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందని వ్యాఖ్యానించారు. ఆలయాలపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఓవైపు తప్పులు చేస్తూ.. మరోవైపు డీజీపీని నిందిస్తున్నారని టీడీపీ, బీజేపీ నేతలపై మంత్రి ఫైర్ అయ్యారు. డీజీపీని రాజీనామా చేయాలంటూ టీడీపీ, బీజేపీ నేతలు చేస్తున్న డిమాండ్‌పై ఆయన తీవ్రంగా స్పందించారు. డీజీపీ ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు ఎవరు చేస్తున్నారో వెల్లడించినందుకు రాజీనామా చేయాలా? అని నిలదీశారు. ఆలయాలపై దాడులకు పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని మంత్రి వెల్లంపల్లి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కుల, మత వైషమ్యాలు రెచ్చగొట్టాలనే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

Also read:

Leopard Attack: తెలంగాణలో రెచ్చిపోతున్న వన్యమృగాలు.. తీవ్ర భయాందోళనలో భైంసా ప్రజలు..

Political Clash: కర్నూలు జిల్లాలో రాజుకుంటున్న రాజకీయాలు.. ఎగసిన కత్తులు.. ఫ్యాక్షన్ సీన్‌ను తలపించిన ఫైట్లు..