Houses Scheme: కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

ఏపీలో కొత్త ఇళ్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్నవారికి కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే కొత్త ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జూన్ నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

Houses Scheme: కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..
Ap Houses

Updated on: Jan 29, 2026 | 3:20 PM

ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్త ఇళ్లు కట్టుకోవాలనుకునేవారి కోసం కీలక ప్రకటన చేసింది. సొంతిళ్లు నిర్మించుకోవాలనే ఆశ ప్రతీఒక్క సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉంటుంది. కానీ సొంతిల్లు కట్టుకోవాలంటే లక్షల్లో డబ్బులు అవసరమవుతాయి. పేదలు, సామాన్యులు దగ్గర అంత సొమ్ము ఉండే పరిస్ధితి ఉండదు. దీంతో సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది. పేదలకు సొంతిళ్ల నిర్మణానికి నిధులు అందిస్తోంది. అలాగే ఇట్టు కట్టుకునేందుకు స్థలం లేనివారికి ఉచితంగా స్థలం కేటాయించి ఇంటిని నిర్మిస్తో్ంది. ఈ పథకంపై తాజాగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీలో సొంతింటి కోసం ఎదురుచూసేవారికి ఇది శుభవార్తగా చెప్పవచ్చు.

2029 నాటికి పక్కా ఇళ్లు

ఏపీలో అర్హులైన ప్రతీఒక్కరికీ 2029 నాటికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పార్థసారధి తెలిపారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 10 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వారితో 7.5 లక్షల మంది అర్హులు ఉండవచ్చని తెలిపారు. వీరందరికీ 2029 నాటికి ఇల్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. అప్పటికల్లా శాశ్వత గృహలు నిర్మించి ఇస్తామని పార్థసారధి చెప్పారు. ఇక మిగిలిన 2.65 లక్షల మందికి 2029 నాటికి స్థలాలు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. అటు ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 2.61 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి పేదలకు పింపిణీ చేస్తామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణ కోసం హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

పీఎం అవాస్ యోజన

అటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం అవాస్ యోజన పథకంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అర్హలకు ఇళ్లను మంజూరు చేస్తోంది. ఇటీవల వీటికి దరఖాస్తులను ఆహ్వానించగా.. లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్ధాయిలో అధికారులు పరిశీలన చేపట్టిన తర్వాత లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. అనంతరం వారికి కొత్త ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా కొత్తగా ఇంటిని నిర్మించుకునేవారికి లబ్దిదారులక రూ.2.50 లక్షల వరకు ఆర్ధిక సాయం అందించనున్నారు. అలాగే బ్యాంకు నుంచి రుణాలు అందేలా చర్యలు చేపట్టనున్నారు. త్వరలోనే పీఎం అవాస్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్నవరికి ఇళ్లు మంజూరు కానున్నాయి. ఏపీలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో కొత్త ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి త్వరలోనే శుభవార్త అందనుంది.