Visakha Utsav 2026: విశాఖ ఉత్సవ్‌లో ప్రోటోకాల్ వివాదం.. కలెక్టర్‌ను తోసేసి అలిగెళ్లిపోయిన మేయర్‌!.. వీడియో

విశాఖ ఉత్సవ్‌ కార్యక్రమాలు నెల 24 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం తొమ్మిది రోజుల పాటు ఇది జరగనుంది. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లు వ్యయంతో నిర్వహిస్తుంది. శ్రేయాస్‌ మీడియా అనే ప్రైవేట్‌ సంస్థకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. అయితే విశాఖ ఉత్సవ్ లో..

Visakha Utsav 2026: విశాఖ ఉత్సవ్‌లో ప్రోటోకాల్ వివాదం.. కలెక్టర్‌ను తోసేసి అలిగెళ్లిపోయిన మేయర్‌!..  వీడియో
Mayor Peela Srinivas Fire On Vizag Collector At Visakha Utsava Event

Updated on: Jan 26, 2026 | 7:07 AM

విశాఖపట్నం, జనవరి 26: విశాఖ ఉత్సవ్‌ కార్యక్రమాలు నెల 24 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం తొమ్మిది రోజుల పాటు ఇది జరగనుంది. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లు వ్యయంతో నిర్వహిస్తుంది. శ్రేయాస్‌ మీడియా అనే ప్రైవేట్‌ సంస్థకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. అయితే విశాఖ ఉత్సవ్ లో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఉత్సవ్ ప్రారంభ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన వేదిక పైకి మంత్రులు రావడంతో నగర మేయర్ పీలా శ్రీనివాస్ ను పక్క సీటులో కూర్చోమని కలెక్టర్ హరిందర్ ప్రసాద్ కోరారు. దీంతో మేయర్‌ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు.

అలిగి అక్కడ నుంచి వెళ్లేందుకు మేయర్ సిద్ధమవడంతో కలెక్టర్‌ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా మేయర్ పట్టించుకోకుండా కలెక్టర్ హరిందర్ ప్రసాద్ ను తోసేసి విసవిసా వెళ్లిపోయారు. ఇక మంత్రులు అనిత, దుర్గేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఆయనను వేదికపైనే ఉండాలని కోరారు. ఎవరిమాట వినకుండా మేయర్ అలిగి వెళ్ళిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.