
చిన్నచిన్న కారణాలతో క్షణికావేశంలో పిల్లలు తీసుకునే నిర్ణయాలు తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చుతున్నాయి. తండ్రి కొత్త మొబైల్ కొని ఇవ్వలేదని కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటుచేసుకుంది. గుడిబండ మండలం సింగేపల్లి గొల్లగట్టి గ్రామానికి చెందిన సుధాకర్ (25).. తండ్రి మొబైల్ కొనివ్వలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిరోజుల క్రితం సుధాకర్ కు తండ్రి కొత్త మొబైల్ కొనిచ్చారు. అయితే సుధాకర్ ఆ ఫోన్ ఎక్కడో పోగొట్టుకోవడంతో మరొక కొత్త మొబైల్ ఫోన్ కొనివ్వాలని తండ్రిని సుధాకర్అడిగాడు. కొత్త ఫోన్ కొనిస్తే పోగొట్టుకొని మళ్లీ ఫోన్ ఎలా కొనివ్వాలని తండ్రి నిరాకరించాడు. అంతేకాకుండా మందలించడంతో కొడుకు సుధాకర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తండ్రి ఫోన్ కొని ఇవ్వలేదన్న క్షణికావేశంలో గొర్రెల మేపేందుకు వెళ్లి… అమరాపురం మండలం బంగారుపాలెం గ్రామం శివారులో పురుగుల మందు తాగి సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో కుమారుడు సుధాకర్ కోసం తండ్రి గాలించగా.. అమలాపురం మండలం బంగారుపాలెం గ్రామ శివారులో విగత జీవుడిగా పడి ఉన్న సుధాకర్ ను గుర్తించారు..
కొద్ది రోజుల క్రితమే కొత్త మొబైల్ ఫోన్ కొనిస్తే పోగొట్టుకున్న సుధాకర్… మళ్లీ మొబైల్ కొన్ని ఇవ్వమని అడగడంతో తండ్రి మందలిచాడని, ఫోన్ కొనివ్వనని చెప్పడంతో మనస్థాపనతో సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సుధాకర్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొత్త మొబైల్ కోసం సూసైడ్ చేసుకుని తల్లిదండ్రులకు సుధాకర్ తీవ్ర దుఃఖాన్ని మిగిల్చాడని గ్రామస్తులు అంటున్నారు.