AP Rains: ఏపీని వదలని అల్పపీడనం.. హెచ్చరికలు ఇచ్చిన వాతావరణ శాఖ

|

Dec 15, 2024 | 1:29 PM

ఏపీకి అల్పపీడన ముప్పు పొంచి ఉంది. డిసెంబర్ 18 వరకు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మరి వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయంటే..

AP Rains: ఏపీని వదలని అల్పపీడనం.. హెచ్చరికలు ఇచ్చిన వాతావరణ శాఖ
Andhra Weather Report
Follow us on

దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిచర ప్రాంతాలు లో ఆనుకుని ఉన్న ఉపరితల అవర్తనం ఇప్పుడు అనగా డిసెంబర్ 15, 2024,0830 గంటలకు అదే ప్రాంతంలో అనగా దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత, మరింత బలపడి బాగా గుర్తించబడిన అల్పపీడనంగా మారి, తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
—————————————-

ఈరోజు, రేపు:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
——————————

ఈరోజు:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ:-
—————

ఈరోజు:-

వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది .