
మండే ఎండల్లో చల్లచల్లగా ఐస్‌క్రీమ్ తిందామనుకున్న ఓ వ్యక్తి.. ఆ చాకోబార్‌ని చూసి షాక్ అయ్యాడు. తాను తిందామనుకున్న ఐస్‌క్రీమ్‌లో బల్లి కనిపించడంతో.. ఆ వ్యక్తి వణికిపోయాడు. ఈ ఘటన ఏపీ-ఛత్తీస్‌గఢ్ బోర్డర్ గ్రామంలో జరిగింది. ఆ ఆస్‌క్రీమ్ లో క్లియర్‌గా బల్లిని చూడొచ్చు. ఆ ఐస్‌క్రీమ్‌ని చూస్తేనే ఒళ్లు జల్దరిస్తోంది. ఆంధ్రా ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎర్రబోర్ గ్రామంలో ఓ వ్యక్తి ఈ ఐస్ క్రీం కొన్నాడు. తిందామని నోటివరకు వచ్చినసమయంలో.. అనుమానం వచ్చి దాన్ని పరిశీలించాడు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అప్పటికే ఆ చిరువ్యాపారి నుంచి చాలామంది ఐస్‌క్రీమ్‌లు కొని తినేశారు కూడా. నిజానికి ఆ వ్యక్తి ఏపీలోని చింతూరు నుంచి ఐస్‌క్రీమ్ విక్రయించేందుకు పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని ఎర్రబోర్ గ్రామానికి వెళ్లాడు. అక్కడే ఈ బల్లి ఐస్‌క్రీమ్ దర్శనమిచ్చింది.
ఈ ఐస్ క్రీమ్ కంపెనీ చింతూరులో తయారు చేసి పక్కరాష్ట్రంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఐస్ క్రీమ్ కొన్న వ్యక్తి బల్లి కనిపించడంతో వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. లోకల్‌గా ఐస్‌క్రీమ్‌లు తయారుచేస్తున్న కంపెనీలపై దృష్టి దారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆంధ్ర ఛత్తీస్‌గఢ్ బోర్డర్‌లో ఐస్ క్రీమ్ విక్రయిస్తే జరిమానా అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన స్థానికులు.. ఇప్పుడు చాకోబార్ లో బల్లి కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చింతూరు నుండి సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుంట తహసీల్ పరిధిలోని ఎర్ర బోరు గ్రామంలో వివాహ వేడుక వద్దకు ఐస్ క్రీమ్ విక్రయించేందుకు వెళ్లిన క్రమంలో.. ఐస్ క్రీమ్ లో బల్లి కనిపించిందని స్థానికులు తెలిపారు. దీంతో అప్పటికే కొనుగోలు చేసిన కొన్ని ఐస్ క్రీమ్ లను తిరిగి ఇచ్చేశారు. అయితే.. తినుబండారాలు, చల్లని పానీయాలు, ఐస్ క్రీమ్ లు పూర్తిగా నాణ్యత లోపంతో తయారవుతున్నాయని.. నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించాలని ప్రజలు అధథికారులను కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..