Andhra: ఓరి.. ఓరి.. రాత్రి షాపులో ఎవరా జీవి.. అసలు కథ ఏందంటే..?

అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఓ దొంగ వెరైటీగా చోరీకి పాల్పడ్డాడు. సింహం మాస్క్ ధరించి కిరాణా దుకాణంలోకి చొరబడి చిల్లర నాణేలు, సరుకులు దొంగిలించేందుకు ప్రయత్నించాడు. సీసీ కెమెరా గుర్తించిన దొంగ.. దృశ్యాలు రికార్డ్ కాకుండా దుప్పటి కప్పే ప్రయత్నం చేయడం గమనార్హం.

Andhra: ఓరి.. ఓరి.. రాత్రి షాపులో ఎవరా జీవి.. అసలు కథ ఏందంటే..?
Anantapur Theft

Edited By:

Updated on: Apr 09, 2026 | 10:58 AM

అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఓ దొంగ వెరైటీగా చోరీకి పాల్పడ్డాడు. అతను చోరీకి  సింహం మాస్క్ ధరించి రావడం విశేషం. సీసీ కెమెరా ముందు గాండ్రిస్తూ.. దృశ్యాలు రికార్డ్ కాకుండా దుప్పటి కప్పాడు. పామిడి పట్టణంలోని ఓ కిరాణా దుకాణంలో రోజు చిల్లర నాణేలు, సరుకులు చోరీకి గురవుతున్నట్లు షాపు యజమానికి అనుమానం వచ్చింది. దీంతో షాపు యజమాని సీసీ కెమెరా ఫిక్స్ చేయించాడు. తాజాగా ఆ ఫుటేజ్ రాత్రి సమయంలో చెక్ చేస్తూ ఉండగా.. ఈ వెరైటీ బాగోతం బయటపడింది. దీంతో వెంటనే అలర్టైన సదరు షాపు యజమాని షాపు వద్దకు చేరుకోగా.. మాస్క్ దొంగ..  సర్దేసిన వస్తువులు పక్కనపెట్టి.. షాపు పైకప్పు నుంచి ఎస్కేప్ అయ్యాడు.

దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అయినా దొంగతనానికి వచ్చిన దొంగ.. తన పని తాను చేసుకుని వెళ్లిపోకుండా.. అలా సీసీ కెమెరా ముందు వచ్చి గాండ్రించడం..  సరిగ్గా అప్పుడే షాప్ యజమాని సీసీ కెమెరా ఫుటేజ్ చూసి. షాపు దగ్గరకు రావడం… వెంటనే మాస్క్ దొంగ పారిపోవడం చూస్తుంటే వెరైటీగా ఉంది అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.

వీడియో దిగునవ చూడండి.. 

Also Read:  ఈ ఒక్క పని చేస్తే పిండి పురుగు అంతా మాడి మసైపోద్ది అంతే.. 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us