AP Farmers : రైతులతో కలిసి దేవినేని ఉమ నిరసన.. ధాన్యం, మొక్కజొన్న రైతుల పంట డబ్బు వెంటనే చెల్లించాలని డిమాండ్

|

Jul 25, 2021 | 9:57 PM

ఆరుగాలం శ్రమించి పండించుకున్న ధాన్యం, మొక్కజొన్న అమ్ముకున్న రైతుల పంట డబ్బు వెంటనే చెల్లించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు...

AP Farmers :  రైతులతో కలిసి దేవినేని ఉమ నిరసన..  ధాన్యం, మొక్కజొన్న రైతుల పంట డబ్బు వెంటనే చెల్లించాలని డిమాండ్
Farmers Dharna
Follow us on

Devineni Uma – Farmers crop Money : ఆరుగాలం శ్రమించి పండించుకున్న ధాన్యం, మొక్కజొన్న అమ్ముకున్న రైతుల పంట డబ్బు వెంటనే చెల్లించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతుంటే మనుషులను పెట్టి బురద జల్లిస్తున్నారంటూ ఆయన అధికార వైసీపీ సర్కారుని నిందించారు. అప్పుల అప్పారావులా 25 వేల కోట్లు అప్పులు చేసి, అవి చాలక ఢిల్లీ చుట్టూ ఆర్థిక మంత్రి బుగ్గన చక్కర్లు కొడుతున్నారని ఉమ ఎద్దేవా చేశారు.

రైతుల ధాన్యం డబ్బులు మీ అవసరాలకు ఉపయోగించుకోవడమేంటి? అంటూ ఉమ ప్రభుత్వాన్ని నిలదీశారు. సుబాబులు రైతు ఇప్పటికే రోడ్డున పడ్డాడని ఉమ అన్నారు. కృష్ణాజిల్లా జి.కొండూరు మండలంలోని కవులూరు గ్రామంలో రైతులతో కలిసి దేవినేని ఉమ ఇవాళ నిరసన వ్యక్తం చేశారు.

ఇలా ఉంటే, మంత్రి పెద్దిరెడ్డి మీద టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “ఏం కౌన్సిలర్లు కావాల్నా నీకు.. కావాలంటే చెప్పు నేనే పంపిస్తా.. ఇంకా మూడేళ్లకు పైగా చైర్మన్ గా ఉంటా.. దమ్ముంటే కాస్కో..” అంటూ జేసీ, పెద్దిరెడ్డికి కౌంటరిచ్చారు.

Read also: Ration Cards : పేదల కడుపు నింపే నూతన రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం .. రేపే ముహూర్తం