కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయ పరిసరాల్లో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్ సమస్య ఎదురైంది. అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో దాదాపు గంట నుంచి ఎయిరిండియా విమానం గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఎయిర్ పోర్ట్ ఆవరణంలో విమానం చక్కర్లు కొడుతోంది.
ఫిబ్రవరి 24న కూడా ఇలాంటి సమస్యే వచ్చింది. ఆ రోజు కూడా గాల్లో చక్కర్లు కొట్టింది స్పైస్‌జెట్ విమానం.
బెంగళూరు నుంచి విజయవాడ వచ్చిన స్పైస్ జెట్ విమానం దట్టమైన పొగమంచు కారణంగా గాల్లో చక్కర్లు కొట్టింది. ఎయిర్ పోర్ట్ రన్‌వేపై పొగమంచు ఎక్కువగా ఉండడంతో స్పైస్ జెట్ విమానం ల్యాండ్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదుర్కొంది.