
నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా గుర్రపు డెక్క వచ్చి చేరుతుంది. ఈ గుర్రపు డెక్కన్ చూడగానే ఏదో వరి నాడు లెక్క కనిపిస్తుంది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే లక్షకు పైగా క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతుంది. అయితే ఈ గుర్రపు టెక్క ఎక్కువ కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహానికి కొట్టుకొని వచ్చి శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌కి చేరుతుందిజ. ఇదంతా ఒక్క దక్కరకు చేరి చూడగానే ఏదో ఉద్యానవనంలా కనిపిస్తోంది. ఈ దృశ్యం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.
జలాశయం బ్యాక్ వాటర్‌లో సగభాగం గుర్రపుడెక్కతో విస్తరించుకుంది. పచ్చని ఆకులతో నీటిపై విస్తరించుకుంటున్న ఈ గుర్రపుచెక్క శ్రీశైలం అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ఈ దృశ్యం చూడడానికి ఎంతో అందంగా కనిపించడంతో పర్యాటకులు దీన్ని చూసేందుకు అసక్తి చూపుతున్నారు. అయితే నీటిమొత్తం విస్తరిస్తున్న ఈ గుర్రపు డెక్కను త్వరగతిన తొలగించకుంటే వాటి ఆకులు కుళ్లిపోయి వరద నీరు నీరు కలుషితం అయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. వాటి కారణంగా జలాశయంలోని చేపలకు కూడా ఇబ్బందులు ఎదురైతాయి అంటున్నారు. ఈ గుర్రపు డెక్క పూర్తిస్థాయిలో విస్తరించక ముందే తొలగించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో 2018 సంవత్సరంలో కూడా ఇలానే గుర్రపుడెక్క భారీగా శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరింది. అప్పుడు కూడా కొన్ని రోజు తర్వాత దాన్ని తొలగించినట్టు తెలుస్తోంది.
ఈ అద్బుతమైన దృశ్యాన్ని చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.