బ్లాక్‌ మార్కెట్‌లో 10 వేలకు ఆనందయ్య మందు.. కొనసాగుతున్న ఐసీఎంఆర్‌, ఆయుష్ అధ్యయనం

|

May 22, 2021 | 1:54 PM

Anandayya Ayurvedic Medicine: నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం బ్రేక్‌‌లు వేడయంతో.. కేటుగాళ్లు ఎంట్రీ ఇచ్చారు. సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు.

బ్లాక్‌ మార్కెట్‌లో 10 వేలకు ఆనందయ్య మందు..  కొనసాగుతున్న ఐసీఎంఆర్‌, ఆయుష్ అధ్యయనం
Anandayya Ayurvedic Medicine
Follow us on

నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం బ్రేక్‌‌లు వేడయంతో.. కేటుగాళ్లు ఎంట్రీ ఇచ్చారు. సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు. ఈ మందుకు భారీగా డిమాండ్ ఉండటంతో బ్లాక్‌ మార్కెట్లో కేటుగాళ్లు దీని అమ్మకాలు మొదలుపెట్టేశారు. ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ 3 వేల నుంచి 10 వేల వరకు మందును  విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఐసీఎంఆర్‌తో పాటు ఆయుష్ అధికారులతో ఈ మందుపై అధ్యయనం చేయిస్తున్న ప్రభుత్వం అనుమతులు వచ్చే వరకూ బ్రేక్ వేయాలని నిర్ణయించింది.శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతుండగా… ఒకట్రెండు రోజుల్లో ఐసీఎంఆర్‌ బృందం కూడా కృష్ణపట్నానికి రానుంది.

తాజాగా మంత్రి పేర్నినాని ఆనందయ్యను కలిసి తాజా పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. నాటు మందు తయారీ విధానంపైనా పేర్నినాని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందిస్తామని ఆనందయ్యకు మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.

Krishnapatnam Anandayya

ఇవి కూడా చదవండి :  CORONA VACCINE: రెండో డోసు ఎంత లేటైతే అంత మేలు.. అమెరికన్ సైంటిస్టుల తాజా అధ్యయనం ఫలితమిదే!

INS Rajput : భారత్ మొదటి యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌’కి సూర్యాస్తమయ సమయంలో తుది వీడ్కోలు పలికిన తూర్పు నావికాదళం