Krishna District: మారెడుమిల్లి ఎన్‌కౌంటర్.. కృష్ణా జిల్లాలో ఆయుధాల కలకలం

కృష్ణా జిల్లా పెనమలూరులో ఆక్టోపస్‌ బృందాల తనిఖీలు చేస్తున్నాయి. కొత్త ఆటోనగర్‌లో 8 మంది అనుమానితుల గుర్తించారు. వారిని మావోయిస్టు సానుభూతిపరులుగా అనుమానిస్తున్నారు. ఆక్టోపస్‌ బృందాలు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ... .. ..

Krishna District: మారెడుమిల్లి ఎన్‌కౌంటర్.. కృష్ణా జిల్లాలో ఆయుధాల కలకలం
Police Searching

Updated on: Nov 18, 2025 | 12:49 PM

మావోయిస్టు అగ్రనేత హిడ్మా అల్లూరి సీతారామరాజు జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మద్వి హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ, టెక్‌ శంకర్ ఉన్నారు. అయితే హిడ్మా ఎన్‌కౌంటర్ అనంతరం ఏపీలోని కృష్ణా జిల్లా పెనుమలూరులో అనుమానాస్పద మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు కొత్త ఆటోనగర్‌లో మరో 8 మంది అనుమానితులు అక్టోపస్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరంతా ఛత్తీస్‌గఢ్‌‌కు చెందినవారని తెలుస్తోంది. వారు నివశిస్తున్న భవనంలో ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. వారిని మావోయిస్టు సానుభూతిపరులుగా అనుమానిస్తున్నారు.