భలే పవర్‌ఫుల్.. కోటి రూపాయలు ఇచ్చిన కూడా ఇది దొరకదు అని పెద్దలు అంటారు..

కొండపిండి ఆకు (కొండపిండి మొక్క) ప్రకృతిలో లభించే ఒక అమూల్యమైన ఔషధ మొక్క. పెద్దలు "కోటి రూపాయలు ఇచ్చినా దొరకదు" అని వర్ణించే ఈ మొక్క కిడ్నీ సమస్యలకు, ప్రత్యేకంగా కిడ్నీలో రాళ్లను తొలగించడంలో దివ్య ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడానికి, మలబద్దకాన్ని నివారించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

భలే పవర్‌ఫుల్.. కోటి రూపాయలు ఇచ్చిన కూడా ఇది దొరకదు అని పెద్దలు అంటారు..
Kondapindi Aaku

Updated on: Mar 18, 2026 | 4:20 PM

మన ప్రకృతిలో అపారమైన ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి. వాటిలో కొండపిండి ఆకు ఒకటి. “కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఇది దొరకదు” అని పెద్దలు ఈ మొక్క విలువను వివరించారు. ఈ సాధారణ మొక్కను కొండపిండి మొక్క అని కూడా పిలుస్తారు. దీని ఆకులు చిన్నవిగా, తెల్లని పువ్వులతో ఉంటాయి. ఈ మొక్క మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడుతుందని, భారతీయ మూలికా శాస్త్రం దీనిని అమూల్యమైనదిగా పరిగణిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

కిడ్నీ సమస్యలకు దివ్య ఔషధం: కొండపిండి ఆకు ప్రధానంగా కిడ్నీ సంబంధిత సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కారం. కిడ్నీలో రాళ్లతో బాధపడేవారికి ఇది సంజీవిని లాంటిది.

పచ్చి ఆకుల వినియోగం: కొండపిండి ఆకులను శుభ్రం చేసి, గుప్పెడు పచ్చి ఆకులను ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున నమిలి తినడం వల్ల కేవలం మూడు నుండి నాలుగు రోజుల్లో కిడ్నీలోని రాళ్లు పగిలిపోయి, మూత్రం ద్వారా తెలియకుండానే బయటకు వెళ్లిపోతాయి. ఇది కొండలను కూడా పిండి చేయగల శక్తి ఈ ఆకుకు ఉందని పెద్దలు అనుభవపూర్వకంగా వాడి చెప్పారు.

కషాయం తయారీ: పచ్చి ఆకులు తినలేని వారు గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళ ఆకులను తీసుకుని, ఒక గ్లాసు నీటిలో వేసి సగం గ్లాసు అయ్యేవరకు మరిగించాలి. ఈ కషాయాన్ని వడకట్టి, ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున సేవించాలి. మూడు రోజుల పాటు ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి. కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కూడా దీని ద్వారా తగ్గుతాయి.

జీర్ణ సంబంధిత ప్రయోజనాలు: కొండపిండి ఆకు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో పూత, పేగుపూత, జీర్ణశక్తి మందగించడం, మలబద్దకం వంటి సమస్యలకు ఇది ఎంతో ఉపకారి.

పొడి రూపంలో వినియోగం: కొండపిండి ఆకులు, పూలు, కాండాన్ని సేకరించి, వాటిని నేరుగా ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టాలి. సుమారు వారం రోజులు ఆరిన తర్వాత, వాటిని రోలు లేదా కలవంలో వేసి బాగా దంచి పొడి చేయాలి. మిక్సీని ఉపయోగించకూడదని సూచించారు. ఈ పొడిని ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్పూన్ మోతాదులో గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపున సేవించాలి. ప్రత్యామ్నాయంగా, రాత్రి పడుకునే ముందు భోజనం చేసిన ఒక గంట తర్వాత ఒక గ్లాసు వేడి నీటిలో ఒక స్పూన్ పొడి కలిపి తాగవచ్చు. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల మలబద్దకం తగ్గి, కడుపు పూర్తిగా శుభ్రపడుతుంది. పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోయి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కొండపిండి ఆకు అనేది ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక గొప్ప సంజీవిని వంటి మొక్క. దీని ప్రయోజనాలు అనేకమందికి తెలియకపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా హాస్పిటళ్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసుకుంటున్నారు. ఈ మొక్కను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఖర్చు లేకుండానే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

గమనిక: ఈ సమాచారం ఆయుర్వేద నిపుణుల నుంచి సేకరించాం. మీకు ఏ సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం ఉత్తమం…

Also Read: తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలంటే ఇది ఒక్క చెంచా వేయండి చాలు.. 

Follow Us