Karthika Pournami : తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ.. శివనామ స్మరణలతో మార్మోగుతున్న శివాలయాలు

Karthika Pournami 2026: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగిస్తూ భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Karthika Pournami : తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ.. శివనామ స్మరణలతో మార్మోగుతున్న శివాలయాలు
Karthika Pournami 2026

Updated on: Nov 24, 2026 | 8:36 AM

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. కార్తీక పౌర్ణమి వేళ పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నరసాపురంలోని వశిష్ఠ గోదావరిలో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా వలందర్ ఘాట్ భక్తులతో కిటకిటలాడుతూ సందడిగా మారింది. భక్తులు నదిలో కార్తీక దీపాలు వదులుతూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దీంతో శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి.

ఇటు రాజమండ్రిలోనూ కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. స్థానిక పుష్కర ఘాట్‌లో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, నదీమతల్లికి దీపాలు సమర్పిస్తున్నారు. కోటిలింగాల ఘాట్ సమీపంలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు, ఉమామార్కండేయ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు తెలంగాణలోని పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం, అభిషేకాలకు భక్తులు బారులు తీరడంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో ఉసిరి దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. కాగా, సాయంత్రం ఆలయ శిఖరంపై నిర్వహించనున్న అఖండ జ్యోతి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us