కాకినాడ(Kakinada) 12 వార్డు దుమ్ములపేట ఆ వార్డులో ఓ ఇల్లు. ఆ ఇంట్లో ఉంటున్నది సముద్రంలో వేటకెళితే గానీ పూట గడవని కుటుంబం. అయితే ఆ ఇంటికి లక్ష రూపాయలు పన్ను చెల్లించాలని కాకినాడ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. అంతే కాదు.. ఇంటి పన్ను కట్టలేదని కుళాయి కనెక్షన్ (Tap Connection) తీసేశారు. వేటకు వెళితే గాని పూటగడవని తాము.. లక్ష రూపాయిలు ఎలా కట్టాలని ఆ మత్స్యకార కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కోట్ల రూపాయల్లో ఆస్తి పన్ను, కుళాయి పన్ను చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా వాటిని వదిలిపెట్టి పేద, మధ్య తరగతి కుటుంబాలను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసనమని ప్రశ్నించారు. వేసవి కాలంలో కుళాయి కనెక్షన్‌ను కట్ చేయడం ఏం పద్ధతని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గోదాముల వంటి ఆస్తులకు, కార్పొరేషన్ దుకాణదారుల అద్దె మాఫీ ఆస్తి పన్ను మాఫీ చేసిన కార్పొరేషన్ పేద, మధ్య తరగతి ప్రజలకు గడువు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు.
సకాలంలో ఆస్తి పన్ను కట్టకపోతే జరిమానా పడుతోంది. ఆస్తిని అమ్ముకున్నా కొనుగోలు చేసినా బకాయిలు కట్టకుండా ప్రభుత్వ లావాదేవీలు జరగవు. కలెక్టర్, ఎస్పీ ఆఫీస్‌తో పాటు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు 2002 నుంచి ఆస్తి పన్ను, కుళాయి పన్ను చెల్లించడం లేదు. ప్రభుత్వ బడ్జెట్ నుంచి వాటికి కేటాయింపులు వచ్చినా జమ చేయడం లేదని ఆరోపించారు. చిత్తశుద్ది వుంటే కార్పొరేషన్ ఖజానా నుంచి జీతాలు తీసుకుంటున్న అధికారులు ముందుగా ప్రభుత్వ కార్యాలయాల ఆస్తులు జప్తు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Also Read
Yadadri: మూతపడనున్న బాలాలయం.. పంచకుండాత్మక యాగం పూర్తి అవుతూనే..