వారాహి మొదటి విడతయాత్రలో ప్రతీసభలోనూ టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్. ప్రభుత్వంపై తన ఆవేశపూరిత ప్రసంగంతోపాటు సభకు వచ్చిన కార్యకర్తల అభిమాన హీరోల పేర్లను ప్రస్తావిస్తూ వారి ఫ్యాన్స్‌కు బూస్ట్ ఇస్తున్నారు. తానూ అందరి సినిమాలు చూస్తాను. తనకు ప్రభాస్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా అందరు హీరోలు ఇష్టం.. మీరు ఏ హీరోని అభిమానించినా మీ ఓటు మాత్రం తనకే వేయాలని, రాజకీయంగా సపోర్ట్ చెయ్యాలని చెబుతూ వస్తున్నారు. ఇక ఈ మధ్య ప్రభాస్ సొంత ఊరు నరసాపురంలో ఏర్పాటైన సభలోనూ పవన్‌కల్యాణ్ ఆయన అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జనసేనకు మద్దతివ్వాల్సిందిగా ప్రభాస్ అభిమానుల్ని కోరారు. ఇదే వారాహి సభలో ఇంతకుముందు తారక్ గురించి ప్రస్తావిస్తూ ఆయన అభిమానుల మనసు గెలుచుకున్నారు.
తాజాగా వారాహి మొదటివిడత ముగింపు సభ జరిగిన భీమవరంలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ రావడం అందరినీ ఆకట్టుకుంది. జనసేన అధ్యక్షుడికి తమ మద్దతు ప్రకటించారు ఎన్టీఆర్ అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనందున పవన్‌కు మద్దతు ఇస్తున్నామన్నారు. మెగాస్టార్, రామ్‌చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీయార్‌కు అభిమానులు ఎక్కువ ఉన్నారన్నారు పవన్. తన అభిమానులు కూడా పర్లేదనుకోండి కొద్దిగా అంటూ మరోసారి ఇతర స్టార్స్ ఫ్యాన్స్‌ని హృదయాలని టచ్ చేశారు పవన్‌కల్యాణ్.
మొత్తానికి వారాహి యాత్రలో సినీ మైలేజ్ పెంచుకునేందుకు పవన్‌కల్యాణ్ అన్నీ అస్త్రాలను వాడేశారు. ఇక ఉభయగోదావరిజిల్లాలో సినీ గ్లామర్ జనసేనవైపే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..