Janasena: భీమ్లానాయక్ స్టైల్‌లో.. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు స్పెషల్ సాంగ్.. జోరుగా సాగుతున్న సభ ఏర్పాట్లు

|

Mar 12, 2022 | 7:47 AM

Janasena: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను ఈనెల 14న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. గుంటూరు జిల్లా(Guntur District) తాడేపల్లి(Tadepalli) మండలంలోని ఇప్పటం గ్రామ సమీపంలో జనసేన..

Janasena: భీమ్లానాయక్ స్టైల్‌లో.. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు స్పెషల్ సాంగ్.. జోరుగా సాగుతున్న సభ ఏర్పాట్లు
Janasena
Follow us on

Janasena: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను ఈనెల 14న  ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. గుంటూరు జిల్లా(Guntur District) తాడేపల్లి(Tadepalli) మండలంలోని ఇప్పటం గ్రామ సమీపంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా ఇప్పటికే నామకరణం చేశారు. ఇప్పటికే కొవిడ్‌ నిబంధనలు సహా 21 షరతులతో సభకు పోలీసులు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌.. సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ ప్రత్యేక పాట.. జనసైనికులను ఆకట్టుకుంటుంది.  భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ స్టైల్ లో సాగుతూ.. “జన జన జన జనసేనా” అంటూ సాగే  ఈ స్పెషల్ సాంగ్ జనసైనికులను, పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. అంతేకాదు పోస్టర్‌పై “భవిష్యత్తు జెండాని మోయటంకంటే బాధ్యత ఏముంటుంది. ఒకతరం కోసం యుద్ధం చేయటంకంటే సాహసం ఏముంటుంది” అంటూ పార్టీ శ్రేణులకు పవన్‌ సందేశమిచ్చారు.

ఇప్పటికే పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆవిర్భావ వేడుకలకు ప్రవాసాంధ్రులు తమ వంతు సహకారం అందించాల్సిందిగా కోరడంతో.. విదేశాల్లోని జనసైనికులు భారీగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

 

Also Read:  DRDO Recruitment: డీఆర్‌డీవీలో అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తులకు గడువు ఇంకా రెండు రోజులే..

Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. భారీగా చెరకు పంట నష్టం.. రైతులు ఆవేదన