Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వైజాగ్ టూ గోవా.. 10 గంటలు కాదు.. ఇకపై 2 గంటల్లోనే!

|

Mar 08, 2023 | 10:54 AM

వైజాగ్ నుంచి గోవాకు వెళ్లాలంటే కచ్చితంగా ట్రైన్‌లో అయితే చాలా కష్టం. ఫ్లైట్ ఎక్కాల్సిందే. అది కూడా హైదరాబాద్ వెళ్లి అక్కడ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్లైట్‌లో గోవాకు వెళ్లాలి.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వైజాగ్ టూ గోవా.. 10 గంటలు కాదు.. ఇకపై 2 గంటల్లోనే!
Representative Image
Follow us on

ఏపీ ప్రజలకు ఓ గుడ్ న్యూస్.. మరీ ముఖ్యంగా గోవా వెళ్లాలనుకునేవారికి ఇది నిజంగానే తీపికబురు. సాధారణంగా మనం విజయవాడ లేదా వైజాగ్ నుంచి గోవాకు వెళ్లాలంటే కచ్చితంగా ట్రైన్‌లో అయితే చాలా కష్టం. ఫ్లైట్ ఎక్కాల్సిందే. అది కూడా హైదరాబాద్ వెళ్లి అక్కడ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్లైట్‌లో గోవాకు వెళ్లాలి. కానీ ఇప్పుడు ఏపీ నుంచి గోవాకు పయనమయ్యే ప్రయాణీకులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. వైజాగ్ నుంచి గోవాకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

మార్చి 28వ తేదీ నుంచి వారానికి మూడు రోజులు( మంగళవారం, గురువారం, శనివారం) వైజాగ్ టూ గోవా మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు తిరగనున్నాయి. ఈ విమానం నార్త్ గోవా ఎయిర్‌పోర్ట్ నుంచి మధ్యాహ్నం 3.40 గంటలకు బయల్దేరి.. సాయంత్రం 5.35 గంటలకు వైజాగ్ చేరుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి.. గోవాకు రాత్రి 8.50 గంటలకు చేరుకుంటుంది. అంటే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం కేవలం 1 గంట 50 నిమిషాలేనని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విశాఖపట్నం, గోవా మధ్య ఇండిగో, ఎయిర్ ఏషియా, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా సంస్థలు అనేక విమాన సర్వీసులు నడుపుతోన్న విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ కూడా డైరెక్ట్ సర్వీసులు కావు. గోవా నుంచి వైజాగ్.. లేదా వైజాగ్ నుంచి గోవా చేరుకోవాలంటే.. బెంగళూరు లేదా హైదరాబాద్‌లో ఇంటర్‌కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సిందే. ఇప్పుడు ప్రయాణీకులకు ఆ భారం తగ్గించేందుకే ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ రెండు నగరాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్‌ను తిప్పనుంది.

కాగా, ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం విశాఖపట్నం టూ గోవా మధ్య ఏడు విమానాలను నడుపుతోంది. అవి ఇన్‌డైరెక్ట్ ఫ్లైట్స్ కావడంతో.. 3 నుంచి 10 గంటల ప్రయాణ సమయం పడుతుంది. ఈ ప్రయాణ సమయాన్ని తగ్గించే క్రమంలోనే ఇండిగో సంస్థ.. వైజాగ్, గోవా మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకు వస్తోంది. దీంతో ఇకపై ఏపీ ప్రజలు రెండు గంటల్లోపే గోవా చేరుకోనున్నారు.