Andhra Pradesh: చంద్రబాబు వస్తే కరవు కాటకాలే.. సభా స్థలాలను శుద్ధి చేసిన వైసీపీ.. ఏపీలో పొలిటికల్ హీట్..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అరిష్టమని వైసీపీ ఆరోపిస్తోంది. అంతే కాదు కర్నూలులో...

Andhra Pradesh: చంద్రబాబు వస్తే కరవు కాటకాలే.. సభా స్థలాలను శుద్ధి చేసిన వైసీపీ.. ఏపీలో పొలిటికల్ హీట్..
Chandrababu Naidu
Follow us

|

Updated on: Nov 20, 2022 | 7:35 AM

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అరిష్టమని వైసీపీ ఆరోపిస్తోంది. అంతే కాదు కర్నూలులో చంద్రబాబు పర్యటించిన ప్రదేశాల్లో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన చుట్టూ రాజకీయ వేడి కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే బాబు పర్యటనలో ఉన్నప్పుడే మూడు రాజధానుల పేరుతో ఆందోళన చేపట్టిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు మరో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టింది. చంద్రబాబు పర్యటించిన ప్రాంతాలు, రోడ్‌ షో, సభలు నిర్వహించిన ప్రాంతాలు అపవిత్రం అయ్యాయని వైసీపీ ఆరోపిస్తోంది. అంతే కాకుండా అక్కడ శుద్ధి చేస్తూ నిరసన చేపట్టింది. బాబు రోడ్ షో నిర్వహించిన ప్రాంతాల్లో కరవు, కాటకాలు రాకుండా పంటలు ఎండి పోకుండా కాపాడాలి అంటూ దేవుడిని వేడుకున్నారు. సభ జరిగిన ప్రాంతాన్ని గోమూత్రము, ఆవుపేడ చల్లి శుభ్రం చేశారు.

చంద్రబాబు సభలు జరిగిన పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరులో ఈ కార్యక్రమాలు చేపట్టారు. తమ ప్రాంతానికి చంద్రబాబు రూపంలో అశుభం, కరవు కాటకాలు రాకుండా చూడాలని ప్రార్థించారు. జగన్ సీఎం అయ్యాక వర్షాలు బాగా పడ్డాయని, గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు లేక రాయలసీమ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. ఆ పరిస్థితి మళ్లీ రాకుడదంటూ దేవుడిని వేడుకుంటూ పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం చేపట్టామంటున్నారు. బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలు చేశారు.

ఏపీ లో చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు అంటూ జనంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు నిరసనలు ఎదురవుతున్నాయి. మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనల రూపంలో న్యాయ రాజధాని కేక, కేపిటల్‌ పొలికేకగా మారింది. చంద్రబాబు మూడు రోజుల కర్నూలు పర్యటన నిరసనల మధ్యే సాగింది. కర్నూలులో న్యాయ రాజధానికి మద్దతు ఇవ్వాలంటూ బాబుకు అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. నిరసనకారులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని వైసీపీ చెబుతోంది. లాయర్లు, విద్యార్థులు నిరసనలు చేపట్టారు. టీడీపీ కార్యకర్తలకు, విద్యార్థులకు, లాయర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ పరిస్థితులతో కర్నూలు జిల్లా రాజకీయంగా వేడి పెంచుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..